TANA: డిసెంబర్‌ 16న శిల్ప కళావేదికలో తానా ‘కళారాధన’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 16న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘కళారాధన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు.

Published : 08 Dec 2022 18:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 16న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘కళారాధన’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు సినీ రంగానికి విశేష సేవలందించిన లెజెండ్స్‌కు పురస్కారాలు అందజేయనున్నట్టు తెలిపారు. 

పద్మభూషణ్‌ సుశీల, పద్మభూషణ్‌ సరోజాదేవి, పద్మశ్రీ.. దాదాసాహెబ్‌ఫాల్కే పురస్కారాల గ్రహీత విశ్వనాథ్‌, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు, సీనియర్‌ నటులు మురళీమోహన్‌, గిరిబాబు, కృష్ణవేణి, జమునా రాణి, లక్ష్మి, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులను తానా పురస్కారంతో సన్మానించనున్నట్లు తానా 23వ మహాసభల కన్వీనర్‌ పొట్లూరి రవి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్‌ పాంత్రా సునీల్‌ తెలిపారు. దీనిలో భాగంగా సినీ ప్రముఖులను తానా తరఫున ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ శోభారాజు అన్నమాచార్య భవన వాహిని, గురు రామాచారి లిటిల్‌ మ్యూజీషియన్స్‌, సిద్ధేంద్ర కూచిపూడి అకాడమీ, అమెరికాకు చెందిన 300 మందికి పైగా విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని