అమెరికాలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్న నార్త్‌అమెరికా సీమాంధ్ర అసోసియేషన్‌

దివంగత నందమూరి తారక రామారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్‌ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Published : 19 Dec 2022 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దివంగత నందమూరి తారక రామారావు శతాబ్ది ఉత్సవాల సందర్భంగా న్యూజెర్సీలోని ఎడిసన్‌ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు భూమిని కేటాయించడానికి ఎడిసన్ పట్టణ మేయర్‌ సమ్మతి తెలిపారని నార్త్‌ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్‌ (ఎన్‌ఏఎస్‌ఏఏ) వెల్లడించింది. ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ భారతీయ చలనచిత్రం రంగంలో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ప్రతిపాదించారు. దీనికి యూఎస్‌లోని లక్షలాదిమంది అభిమానులు మద్దతు తెలిపారు.తమ ప్రతిపాదనను ఎడిసన్‌ మేయర్‌ సామ్‌ జోషికి తెలియజేయగా అంగీకరించినట్లు ఎన్‌ఏఎస్‌ఏఏ తెలిపింది. మేయర్ సామ్ జోషి ఎడిసన్ నగరంలో భారతదేశానికి  చెందిన మొదటి మేయర్ కావడం ఇంకాస్త కలిసొచ్చింది.

న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ నియమించిన సాకేత చదలవాడ, కమిషనర్ న్యూజెర్సీ స్టేట్ ఆసియన్ అమెరికన్, కళా కమిటీ సభ్యుడు ఉజ్వల్ కుమార్ కస్తాల, మేయర్‌తో కలిసి భూమిని గుర్తించేందుకు కృషి చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రభుత్వ స్థలంలో ఎన్టీఆర్ తొలి విగ్రహం ఇదే కానుంది. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, సంస్కరణలను తెలుగు ప్రజలు ప్రతిచోటా గుర్తుంచుకుంటారు. ఇప్పుడు, ప్రభుత్వ స్థలంలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించడం ప్రతి భారతీయుడు, ప్రత్యేకించి తెలుగు ప్రజలు గర్వించే విషయమవుతుంది. ఎడిసన్‌లో ఉంటున్నవారే కాకుండా యూఎస్‌లోని పలువురు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఇందులో స్వాతి అట్లూరి, నాసా, తానా సంస్థ, ముఖ్యంగా అంజియ చౌదరి (తానా) అధ్యక్షుడు, రవి పొట్లూరి(తానా) 2023 కన్వెన్షన్ చైర్‌కు చెందిన పలువురు వాలంటీర్లు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని