తెలుగు భాషాభిమానులు అందరూ చూడాల్సిన సినిమా!

తెలుగు భాషాభిమానులు అందరూ చూడాల్సిన చిత్రం ‘సిరిజోత’ అని సింగపూర్‌లోని పలువురు ప్రవాసులు అభిప్రాయపడ్డారు.

Published : 17 Jan 2023 20:17 IST

సింగపూర్‌: తెలుగు భాషాభిమానులు అందరూ చూడాల్సిన చిత్రం ‘సిరిజోత’ అని సింగపూర్‌లోని పలువురు ప్రవాసులు అభిప్రాయపడ్డారు. శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్ మీద నిర్మించిన లఘు చిత్రం సిరిజోతను తాజాగా సింగపూర్‌ ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్‌లో ప్రదర్శించారు. సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి ఈ కథ, మాటలు అందించిన ఈ చిత్రానికి సురేశ్‌ రాజ్‌ దర్శకత్వం వహించారు. అభిరాం, విజయ భరత్ పర్యవేక్షించారు. తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిత్ర బృందం కృషిని శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు రాంబాబు పాతూరి, సింగపూరు తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు రంగ రవి, సింగపూరు పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు సునీత  తదితర ప్రముఖులందరూ  చిత్రాన్ని చూసి అభినందించారు. తెలుగు భాష మీద చిత్రం నిర్మించడం ఆనందదాయకమని నిర్మాత సుబ్బు పాలకుర్తి తెలియచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని