హాంగ్‌ కాంగ్‌లో బుజ్జాయిలతో భోగి

విదేశాల్లో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుంటారు మన తెలుగు వాళ్లు. పండగలకు కావాల్సిన సామగ్రి అందుబాటులో లేకపోయినా సమకూరిన వాటితోనే సంప్రదాయబద్ధంగా పండగలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటారు.

Published : 18 Jan 2023 17:46 IST

హాంకాంగ్‌: విదేశాల్లో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుంటారు మన తెలుగు వాళ్లు. పండగలకు కావాల్సిన సామగ్రి అందుబాటులో లేకపోయినా సమకూరిన వాటితోనే సంప్రదాయబద్ధంగా పండగలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతిని ఇలానే ఏళ్లుగా హాంగ్‌ కాంగ్‌లోని ప్రవాస భారతీయులు నిర్వహిస్తున్నారు. ఏటా స్థానిక తెలుగువారితో కలిసి సంక్రాంతి పండగను జరుపుకొంటున్నారు. తమ పిల్లలతో పాటు తమ ఎస్టేట్‌లోని మరికొంత మంది పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో బోగి’ని నిర్వహించడం మొదలు పెట్టామని, గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి తెలిపారు.

హాంగ్ కాంగ్‌లో డూడు బసవన్నలు, గంగిరెద్దుల ఆటలు కనిపించక పోయినా ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా బుజ్జాయిలతో భోగి కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జయ పీసపాటి తెలిపారు. క్రిస్మస్‌ సెలవులకు భారత్‌ వెళ్లినప్పుడు సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, కొత్త బట్టలు, నగలు, బొమ్మలు తెచ్చుకుంటూ ఉంటామని చెప్పారు. భోగి రోజున నిర్వహించిన భోగి పళ్ల కార్యక్రమంలో దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా.. హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని హర్షిణి ప్రార్థనగీతం ఆలపించారు. పెద్దలు, తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక ఈ సందర్భంగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని