లోకేశ్‌ పాదయాత్రకు ప్రవాసాంధ్రుల సంఘీభావం

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో తలపెట్టిన పాదయాత్రకు ప్రవాసాంధ్రుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

Published : 19 Jan 2023 23:53 IST

కువైట్‌: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌  ‘యువగళం’ పేరుతో తలపెట్టిన పాదయాత్రకు ప్రవాసాంధ్రుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ మేరకు కువైట్ తెలుగుదేశం విభాగం అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు ఇటీవల లోకేశ్‌ని కలిసి రైల్వేకోడూరు నియోజకవర్గ సమస్యలపై, కువైట్‌లో నిర్వహించే కార్యక్రమాల గురించి చర్చించారు. ఈ నెల 27నుంచి తలపెట్టిన పాదయాత్రకు తమ సంఘీభావం ప్రకటించారు. 400 రోజులపాటు కొనసాగే ఈ పాదయాత్రలో కువైట్‌లోని ప్రవాసాంధ్రులు అధికసంఖ్యలో పాల్గొంటారని లోకేశ్‌కి వివరించారు.

తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ సుధాకరరావు మాట్లాడుతూ యువగళం పాదయాత్రకు సంఘీభావంగా కువైట్‌లో కూడా పాదయాత్ర చేపట్టదలిచామని అన్నారు. పార్టీ అభిమానులందరూ కార్యక్రమంలో అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

 

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు