నారా లోకేశ్ పాదయాత్రకు తెదేపా సౌదీ అరేబియా మద్దతు

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఎన్నారై తెదేపా సౌదీ అరేబియా కార్యవర్గం మద్దతు తెలిపింది.

Updated : 29 Jan 2023 00:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రకు ఎన్నారై తెదేపా సౌదీ అరేబియా కార్యవర్గం మద్దతు తెలిపింది. ‘యువగళం’ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ అల్‌ ఖొబర్‌లో వందలాది తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు నాయుడు ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. లోకేశ్‌ పాదయాత్రకు ఎన్నారైల తోడ్పాటు గురించి చర్చించారు. 

సమావేశానికి సౌదీ అరేబియా తెదేపా అధ్యక్షుడు ఖలిద్ సైఫుల్లా అధ్యక్షత వహించారు. గల్ఫ్‌ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ స్వాగతోపన్యాసం చేశారు. జగన్ పాలనతో జరుగుతున్న నష్టాన్ని గురించి ఆయన వివరించారు. తెదేపాను అధికారంలోకి తీసుకురావటానికి లోకేశ్‌ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్‌ను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భరద్వాజ్‌, చంద్ర శేఖర్, భాస్కర్, చిన్నా, కోగంటి శ్రీనివాస్‌, భాను ప్రకాష్, నియాజ్‌, పవన్, సత్య, నవీన్, శ్రీనివాస్‌, శర్మ, రమేష్, ఝాన్సీ, శ్రావ్య, వర్దిని, లక్ష్మి, సమీర, ఆంధ్ర వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని