గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి ఘన సన్మానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘సర్వనిధి స్వర వీణాపాణి’ విజయోత్సవ సభ, సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
డాలస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘సర్వనిధి స్వర వీణాపాణి’ విజయోత్సవ సభ, సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రవాస భారతీయులు, సంగీత.. సాహితీ ప్రియులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తానా కౌన్సిలర్ ఎట్ లార్జ్ ప్రతినిధి లోకేశ్ నాయుడు.. సభ్యులకు స్వాగతం పలికి, సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. ‘స్వరనిధి స్వర వీణాపాణి’కి అభినందనలు తెలిపి సభను ప్రారంభించారు. తానా కళాశాల ఛైర్మన్ రాజేష్ అడుసుమిల్లి మాట్లాడుతూ.. కళాశాల ప్రారంభం నుంచి ఎంతోమంది నృత్య కళాకారులకు కూచిపూడి నృత్యంలో పట్టభద్రులు కావడానికి సహకారమందించినట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులకు తమ ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు.
సంగీత గురువు సమీరా శ్రీపాద విఘ్నేశ్వర స్తుతి ప్రార్ధనా గీతంతో సభను ప్రారంభించారు. తానా తెలుగు భాషా పరివ్యాప్తి కమిటి ఛైర్మన్ చినసత్యం వీర్నపు స్వరవీణాపాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2018లో వారితో ‘సప్తస్వర అష్టావధానం’ నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. తెలుగు సినిమా పాటకు ఆస్కార్ అవార్డు రావడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. గీత రచయిత, సంగీత దర్శకుడు, చిత్ర దర్శకులు, నిర్మాత, నృత్య దర్శకులకు అభినందనలు తెలిపారు. 72 మేళకర్తాల రాగాల స్వరూపం మొత్తాన్ని ఒక సంక్షిప్త కీర్తనలో పొందుపరచి, 61 గంటలకుపైగా పాడి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ సొంతం చేసుకున్న స్వరవీణాపాణిని సభకు పరిచయం చేసి, కరతాళ ధ్వనుల మధ్య వేదిక పైకి ఆహ్వానించారు. వీణాపాణి గిన్నిస్ రికార్డు అందుకోవడం తెలుగు జాతికి గర్వకారణమన్నారు. సంగీత ప్రపంచం మొత్తం 72 మేళకర్తాల రాగాలలోనే నిబిడీకృతమై ఉంటుందని వివరించారు.
ముఖ్యఅతిథి స్వర వీణాపాణి మాట్లాడుతూ.. తనకు ప్రసాద్ తోటకూరని తనికెళ్ళ భరణి పరిచయం చేశారని గుర్తు చేశారు. తరువాత వారితో అనుబంధం జీవితంలో మరువలేనిదన్నారు. వెన్నం ఫౌండేషన్ అధినేత మురళీ వెన్నం, ప్రసాద్ తోటకూర ఇచ్చిన ప్రోత్సాహం, ఆదరాభిమానాలు తనను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును అందుకునే వరకు కొనసాగాయన్నారు. వారి ప్రస్థానం, అనుభవాలను సంగీత, సాహిత్య ప్రియులతో పంచుకొని అందరి ఆదరాభిమానాలను పొందారు.
ఈ సందర్భంగా లండన్ లో గిన్నిస్ రికార్డ్‌ల పర్యవేక్షణ అధికారి బృందం వద్ద ఆలపించిన ‘స్వర గాంధీజీ -72 మేళకర్తల’ రాగాలను, స్వర కామాక్షి, స్వర బీజాక్షి కీర్తనలను వీనుల విందుగా ఆలపించి తన సంగీత ప్రతిభతో అందరినీ మంత్రముగ్దులను చేశారు. వారికి తబలా వాయిద్య సహకారం అందించిన శ్రీనివాస్ ఇయ్యున్నినీ ప్రత్యేకంగా అభినందించారు. అనతరం ప్రసాద్ తోటకూర, మురళీ వెన్నం చేతులు మీదుగా.. లండన్‌లో తీసుకున్న ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అవార్డును అందజేశారు. తానా, టాంటెక్స్ అధికార బృందం స్వరవీణాపాణిని శాలువ, జ్ఞాపికతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా వీణాపాణి.. సభలో ఉన్న తన గురువు డా.జయకృష్ణ బాపూజీ జంధ్యాలకు పాదాభివందనం చేసి వారి దీవెనలు అందుకున్నారు. బాపూజీ జంధ్యాల.. తన శిష్యుడు అయిన వీణాపాణిపై చక్కటి కవితను రాసి అందరికీ వినిపించారు.
ఈ కార్యక్రమంలో లోకేశ్ నాయుడు, మురళీ వెన్న, శ్రీకాంత్ పోలవరపు, అశోక్ కొల్లా, చినసత్యం, వీర్నపు, ఊరిమిండి నరసింహారెడ్డి, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, భానుమతి ఇవటూరి, లక్ష్మి పాలేటి, శరత్ యర్రం (టాంటెక్స్ అధ్యక్షులు), వెంకట్ ములుకుట్ల, పరమేష్ దేవినేని, సాంబయ్య దొడ్డ, వెంకట ప్రమోద్, కళ్యాణి తాడిమేటి, వీర లెనిన్, లెనిన్ వేముల, సుందరరావు బీరం, బాపూజీ జంధ్యాల తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Mangalagiri: రెండేళ్ల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి
-
Ap-top-news News
ISRO: అక్కడే చదివి.. శాస్త్రవేత్తగా ఎదిగి..ఎన్వీఎస్-01 ప్రాజెక్టు డైరెక్టర్ స్ఫూర్తిగాథ
-
India News
Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్ చెప్పులు
-
Ts-top-news News
Raghunandan: ఎమ్మెల్యే రఘునందన్పై రూ.1000 కోట్లకు పరువునష్టం దావా
-
Sports News
Dhoni: రిటైర్మెంట్పై నిర్ణయానికి ఇది సరైన సమయమే కానీ.. ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India News
Bus Accident: లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి