ప్రవాసులు ప్రగతికి ఊతమివ్వాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని, ప్రవాసులు దానికి మరింత ఊతమివ్వాలని భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు.

Updated : 16 Jul 2023 06:25 IST

బ్రిస్బేన్‌ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని, ప్రవాసులు దానికి మరింత ఊతమివ్వాలని భారాస ఎమ్మెల్సీ, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. స్వదేశానికి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌ నగరంలో శనివారం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి తెలంగాణలోనే ఉంది. తెలంగాణ సంప్రదాయాలను ప్రవాసులు ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్నారు. ఆస్ట్రేలియా రాజకీయాల్లోనూ రాణిస్తుండడం గర్వకారణం’’ అని కవిత తెలిపారు. అంతకుముందు అక్కడి తెలంగాణవాసుల కుటుంబాలను సందర్శించిన కవిత వారి ఇళ్లలో బోనాలను అలంకరించారు.  భారత్‌ జాగృతి ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు శ్రీకర్‌రెడ్డి, భారాస ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, బ్రిస్బేన్‌ తెలంగాణ సంఘం అధ్యక్షుడు కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు