టాస్-యూకే ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 22 Nov 2023 12:39 IST

లివింగ్‌స్టన్‌ : తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. లివింగ్‌స్టన్‌లోని ఇన్వర్ ఆల్మండ్ కమ్యూనిటీ హైస్కూల్ ఆడిటోరియంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత కాన్సుల్ జనరల్ సత్యవీర్ సింగ్ హాజరయ్యారు.

సంస్థ సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి తన ఆత్మీయ స్వాగతంతో వేడుకలను ప్రారంభించారు. సిలికాన్ ఆంధ్రా మనబడి తెలుగు విద్యార్థులు "మా తెలుగు తల్లికి" పాటను ఆలపించి ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని గానం, నృత్యం, నాటకాలు,  వాయిద్యం వంటి విభిన్నమైన అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పుష్య రాగ సిద్ధ సాయి హరి, దివ్యా దేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

భారత కాన్సుల్ జనరల్ సత్య వీర్ సింగ్ మాట్లాడుతూ.. భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలు, విలువలను విదేశాల్లో ఉంటూ భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. సాంస్కృతిక వారసత్వం పట్ల శాశ్వతమైన నిబద్ధతను సూచిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ, పూర్వ ఎగ్జిక్యూటివ్ కమిటీల ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఛైర్మన్ మైథిలి కెంబూరి ఈ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించగా.. ప్రాజెక్ట్స్ అండ్‌ విమెన్స్ సర్వీసెస్ సెక్రటరీ మాధవీలతా దండూరి సహాయ సహకారాలు అందించారు. అధ్యక్షుడు శివ చింపిరి మార్గదర్శకత్వంలో.. సాంస్కృతిక కార్యదర్శి విజయ్ కుమార్ పర్రి కార్యక్రమాన్ని రూపొందించారు. కోశాధికారి నిరంజన్ నూక,  సంయుక్త కార్యదర్శి వెంకటేష్ గడ్డం ప్రవేశ ద్వారం వద్ద ఆహూతులకు స్వాగతం పలికారు. ఐటీ పీఆర్ కార్యదర్శి పండరి జైన్ పోలిశెట్టి సాంకేతిక సహకారం, పబ్లిసిటీ, ప్రత్యక్ష ప్రసారాల బాధ్యతలను చూశారు. క్రీడా శాఖ కార్యదర్శి జాకీర్ షేక్, యువజనసేవా కార్యదర్శి నరేష్ దీకొండ లాజిస్టిక్స్, క్యాటరింగ్ విక్రేతల సమన్వయానికి సహకరించారు. ప్రధాన కార్యదర్శి ఉదయ్ కుమార్ కూచడి వేదికాలంకరణ బాధ్యతలను చూసుకున్నారు. అదనపు ప్రాజెక్టుల కార్యదర్శులు రాజశేఖర్ సాంబ, బాలాజీ కర్నాటి కార్యక్రమ నిర్వహణలో సహాయ సహకారాలు అందించారు.

ఈ కార్యక్రమంలో వివిధ భారతీయ కమ్యూనిటీ అసోసియేషన్లకు చెందిన గౌరవ అతిథులు కూడా పాల్గొన్నారు. టాస్-యూకే దీపావళి సంబరాలు 2023 స్కాట్లాండ్‌లోని భారతీయ తెలుగు సమాజం ఐక్యత, వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని