ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) 2024వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పాటైంది.

Published : 26 Feb 2024 11:53 IST

ఆస్టిన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) 2024వ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పాటైంది. రౌండ్ రాక్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని పరిచయం చేశారు. అధ్యక్షుడిగా పరమేశ్వర రెడ్డి నంగి, ఉపాధ్యక్షుడిగా శ్రీని బైరపనేని, సెక్రెటరీగా భరత్ పిస్సాయ్, ట్రెజరర్‌గా చిన్నప రెడ్డి కుందూరు నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా ఐదుగురిని ఎన్నుకున్నారు. ప్రతిభ నల్ల (కల్చరల్ ), లక్ష్మీకాంత్ ( ఫైనాన్స్ అండ్‌  స్పాన్సర్షిప్), వెంకటేశ్‌ దూబాల ( ఫుడ్ అండ్‌ లాజిస్టిక్స్), శ్రీలత అంబటి ( మెంబర్షిప్ అండ్‌ టెక్నాలజీ), సర్వేశ్వర రెడ్డి పాశం ( స్పోర్ట్స్ ) సంయుక్త కార్యదర్శులుగా నియమితమయ్యారు.

బోర్డు అఫ్ డైరెక్టర్లుగా అర్జున్ అనంతుల, గిరి మేకల, బ్రహ్మేంద్రరెడ్డి లాక్కునిని ఎన్నుకున్నారు. గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తులతోపాటు ఇతర టీసీఏ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు