మంగళగిరిలో ‘యూరో కార్ట్’లు.. నారా లోకేశ్‌ చేతుల మీదుగా చిరు వ్యాపారులకు అందజేత

లండన్ ఎన్నారై  ‘జై కుమార్ గుంటుపల్లి’ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్‌లో విజయవంతమైన ‘యూరో కార్ట్’లను ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని సంకల్పించారు.

Published : 02 Mar 2024 17:07 IST

లండన్ ఎన్నారై  ‘జై కుమార్ గుంటుపల్లి’ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. యూరప్‌లో విజయవంతమైన ‘యూరో కార్ట్’లను ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని సంకల్పించారు. ఇందుకోసం ఎన్నారై తెదేపా అధినేత డాక్టర్ రవి వేమూరితో చర్చించారు. ఆ ప్రతిపాదనకు జై కుమార్ ఆర్థికంగానూ అండగా నిలిచారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెన్ను తట్టారు. ప్రయోగాత్మకంగా మంగళగిరిలో ‘యూరో కార్ట్’లను కొంతమంది చిరు వ్యాపారులకు, లోకేశ్‌ స్వయంగా అందించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఐరోపాలో ప్రజలు చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల (కార్ట్) నుంచి ఆహారాన్ని నిస్సంకోచంగా కొంటుంటారు. ఆ ‘యూరో కార్ట్‌’ల ద్వారా కొనుగోలు చేసే ఆహార పదార్థాలు సురక్షితమైనవని ప్రజలు నమ్ముతారు. అందుకే వాటిని ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేయాలని సంకల్పించారు. ఏపీలోని చాలామంది వీధి వ్యాపారుల దగ్గర, తోపుడు బండ్లు, ఫుడ్ స్టాల్స్ దగ్గర ఆహారం పరిశుభ్రంగా ఉండదన్న  భావనను తొలగించాలన్న ఉద్దేశంతో ‘యూరో కార్ట్’ లను ఏపీకి పరిచయం చేశారు. ఇటు కస్టమర్లకు.. అటు వ్యాపారులకు ఇరువురికి ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిద్వారా చిరు వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ఈ యూరో కార్ట్‌ల ద్వారా.. తోపుడు బళ్లను అద్దెకిచ్చే స్థానిక మాఫియాను కూడా నిర్మూలించవచ్చు. అంతేకాకుండా, చిరు వ్యాపారులు కూడా రుణ విముక్తులవుతారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నారా లోకేశ్‌ తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి కొందరు చిరు వ్యాపారులకు యూరో కార్ట్‌లను అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని