డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు.

Updated : 27 Mar 2024 15:29 IST

‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్’(WETA) సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని డాలస్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. "ఫ్రిస్కో" లోని ఇండిపెండెన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిటీ కౌన్సిల్ ప్రొటెం మేయర్ జోన్ కీటింగ్ కీలకోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా టెక్ లీడర్ ఎమీ జుచ్లెవిస్కీ, అంబికా దద్వాల్ (ప్రొడక్ట్ ఎగ్జిక్యూటివ్‌) ప్రస్తుతం సమాజంలో మహిళల పాత్రపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సమాజ సేవకు గాను సురోమా సిన్హా, మెర్సీ స్ట్రిక్‌ల్యాండ్‌లకు ఆదర్శప్రాయమైన సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.  ఈ కార్యక్రమానికి వీణా యలమంచిలి వ్యాఖ్యాతగా నిర్వహించగా.. సాంస్కృతిక కళారూపాలు అందరినీ అలరించాయి. ప్రముఖ గాయని సుమంగళి, శ్రీకాంత్‌ లంక తమ పాటలతో ప్రేక్షకులకు వీనుల విందు చేశారు.

ఈ కార్యక్రమ్యాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ప్రెసిడెంట్ శైలజ కల్లూరి.. లోకల్ WETA డాలస్‌ టీమ్‌ నవ్య స్మృతి రెడ్డి, ప్రతిమ రెడ్డి, గాయత్రి గిరి, మాధవి, ప్రశాంతి, జ్యోత్స్న, రేఖలకు ప్రత్యేక  ధన్యవాధాలు తెలిపారు. రత్నమాల వంక, సునీత గంప, విశ్వా వేమిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

"తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో తెలుగు మహిళల సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను 2019లో ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేశారు. స్త్రీలకు సరైన నైపుణ్యాలను అందించడం, సాధికారత, మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ సంస్థ వేదిక లాగా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని