సింగపూర్‌లో వైభవంగా వాసవీ జయంతి పూజా కార్యక్రమాలు

వాసవి క్లబ్ మెర్లయిన్ సింగపూర్ (VCMS) వారి ఆధ్వర్యంలో, వాసవి జయంతి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.

Published : 20 May 2024 16:07 IST

సింగపూర్‌: వాసవి క్లబ్ మెర్లయిన్ సింగపూర్ (VCMS) వారి ఆధ్వర్యంలో, వాసవి జయంతి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మే 18న  శ్రీ మారియమ్మన్ దేవాలయంలో జరిగిన ఈ వేడుకల్లో 400 మందికి పైగా ఆర్యవైశ్యులు పాల్గొని భక్తితో పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షులు రంగా రవికుమార్, కర్నాటి శేష, VCMS ప్రతినిధి బృందం మురళి కృష్ణ, సుమన్ రాయల, ముక్క కిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎండోమెంట్ బోర్డుకు చెందిన బొబ్బ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. చిన్నారి కరె సాయి కౌశల్ గుప్త గణపతి ప్రార్థనతో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. మౌల్య కిశోర్ శెట్టి, మేదం సిద్ధిశ్రీ ముక్తిధ, నంబూరి ఉమా మోనిష, చిన్ని హష్మిత, చైతన్య నంబూరి శాస్త్రీయ నృత్యం చేశారు. తోటంశెట్టి నంద సాయి వేణుగానం, కొణిజేటి వెంకట ఇషాన్ కృష్ణ గానం అలరించాయి. కర్లపాటి శిల్ప, నేరెళ్ల నిరంజన, నూలు అర్చిత సాయి కీర్తన, నామ రామాయణాన్ని పారాయణం చేసి ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు. రామాయణం ఇతివృత్తంగా కిషోర్ కుమార్ శెట్టి ఆధ్వర్యంలో ప్రదర్శించిన సంక్షిప్త నాటకాలు పతనమవుతున్న మానవ విలువలను తెలియజేశాయి. గాదంశెట్టి నాగ సింధు నేతృత్వంలో 28 మంది ఆర్యవైశ్య మహిళలు చేసిన కోలాట నృత్య ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకర్షించింది.  ఫణేష్ ఆత్కూరి, వాసవి కన్యకా పరమేశ్వరి తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వాసవి మాతకు కుంకుమార్చన చేశారు. అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణతో సేవించుకున్నారు. అనంతరం జరిగిన రథ యాత్రలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. గత కొన్ని సంత్సరాలుగా జరుగుతున్న వాసవి జయంతి వేడుకలతో పాటు, వివిధ కార్యక్రమాలకు తనవంతు కృషి చేస్తున్న కార్యనిర్వాహక బృంద సభ్యుడు ముక్క కిషోర్‌ని కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమం వైభవంగా జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ VCMS అధ్యక్షులు మురళీ కృతజ్ఞతలు తెలిపారు. 

వాసవి సేవాదళ్ సభ్యులు దివ్య గాజులపల్లి, సోమిశెట్టి శ్యామల, ఆత్మూరి భరత్, జాన్హవి రాజన్, జయకుమార్ పంచనాథన్. మార్తాండ్ కటకం, శివ కిషన్ కరె, స్వాతి కరె, రాఘవ ఆలపాటి, రాజన్ రాందాస్, కొణిజేటి విష్ణుప్రియ, విషి కూన, అవినాష్ కోట, అనిల్ కుమార్ సాధు, దత్త కొత్తమాసు, సంతోష్ మాదారపు, లక్ష్మణ్ రాజు కల్వా, ముక్క సతీష్, కార్తీక్ మణికంఠ, సురేష్ దిన్నేపల్లి తదితరులకు కార్యదర్శి సుమన్‌ రాయల ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులు వినయ్ బత్నూర్,  మకేష్ భూపతి, కిశోర్ కుమార్ శెట్టి, ఫణేష్ ఆత్కూరి, ఆనంద్ గంధే, రాజా విశ్వనాథులు, సరితా విశ్వనాథ్‌ల కృషిని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని