హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

హాంకాంగ్‌లో తెలుగు వారంతా కలిసి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

Updated : 22 May 2024 12:14 IST

హాంకాంగ్‌లో తెలుగు వారంతా కలిసి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ‘ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రముఖులు, కె. వెంకట రమణ(కాన్సులేట్‌ జనరల్ అఫ్ ఇండియా, హాంకాంగ్‌, మకావ్) మాస్. ఏమి యుంగ్(డిస్ట్రిక్ట్  ఆఫీసర్ - ఐలాండ్స్, హాంకాంగ్‌ హోమ్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌);  లాల్ హర్దసాని(ప్రెసిడెంట్, ది  హిందూ  అసోసియేషన్); ఉస్తాద్ గులాం సిరాజ్ (చైర్మన్, పుంహక) కె. వెంకట వంశీధర్(రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

వెంకట రమణ దీప ప్రజ్వలన చేసి ప్రసంగించారు. హాంకాంగ్‌లో తెలుగు వారు సమాఖ్య ద్వారా భాష- సాంస్కృతిక పరిరక్షణకు చేస్తున్న కృషిని కొనియాడారు. అనంతరం "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" గానంతో  ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, నృత్యాలు, హాస్య నాటికలతో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్ఛంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ, అంతర్జాతీయ మారథాన్లు,  ఆక్స్‌ఫామ్ ట్రయల్ వాకర్‌లో పాల్గొన్న వారికి వెంకట రమణ జ్ఞాపికలు అందించారు.

సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి మాట్లాడుతూ.. సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిందని కొనియాడారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకు పెద్ద హాల్స్‌ అందుబాటులో ఉండవని.. ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడే వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. అందుకే ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యమైందని వివరించారు. జూన్‌లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు.

ఈ వేడుకల నిర్వహణలో సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే, రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా, ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష, రవికాంత్ గునిశెట్టి, కల్పన, జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక, బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని