చికాగోలో అంబరాన్ని అంటిన తెదేపా కూటమి సంబరాలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెదేపా కూటమి అఖండ విజయం సాధించడంతో చికాగోలోని తెదేపా, జనసేన, భాజపా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Published : 06 Jun 2024 12:50 IST

చికాగో: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తెదేపా కూటమి అఖండ విజయం సాధించడంతో చికాగోలోని తెదేపా, జనసేన, భాజపా అభిమానులు పెద్ద సంఖ్యలో గుమికూడి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచీ కూటమి విజయం దిశగా దూసుకొని పోవడంలో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్థానిక మాల్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ వాచ్ పార్టీని చికాగో ఎన్ఆర్ఐ తెదేపా కార్యవర్గం ఆధ్వర్యంలో సీనియర్ నాయకుడు హేమ కానూరు, సిటీ ప్రెసిడెంట్ రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, సెక్రటరీ వెంకట్ యలమంచిలి, ట్రెజరర్ విజయ్ కొరపాటి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రఘు చిలుకూరి, రీజినల్ కౌన్సిల్ చిరు గల్లా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, కృష్ణ మోహన్ చిలమకూరు తదితరులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు కూడా భారీగా హాజరై ఆనంద ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు