Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం

అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన బైక్‌ ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థి మృతిచెందాడు.

Published : 23 May 2024 22:50 IST

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో విషాదం చోటుచేసుకుంది. బైక్‌ ప్రమాదంలో ఏపీకి చెందిన యువకుడు బీలం అచ్యుత్‌ ప్రాణాలు కోల్పోయాడు. అతడు న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్నట్లు గుర్తించారు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘‘న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్‌ బైక్‌ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి చాలా బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’’ అని కాన్సులేట్‌ జనరల్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు