చికాగోలో వేడుకగా విజయవాడ కనకదుర్గమ్మవారి పూజలు

చికాగోలో విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు వేడుకగా పూజలు నిర్వహించారు. రోలింగ్ మెడోస్ ప్రాంతంలో ఉన్న సాయి మందిర్‌లో స్థానిక తానా సభ్యులు హేమ కానూరు ఆధ్వర్యంలో దుర్గగుడి అర్చకులు రెండు రోజుల పాటు ఈ పూజలు జరిపించారు.

Published : 30 Jun 2022 22:58 IST

అమెరికా: చికాగోలో విజయవాడ కనకదుర్గమ్మకు భక్తులు వేడుకగా పూజలు నిర్వహించారు. రోలింగ్ మెడోస్ ప్రాంతంలో ఉన్న సాయి మందిర్‌లో స్థానిక తానా సభ్యులు హేమ కానూరు ఆధ్వర్యంలో దుర్గగుడి అర్చకులు రెండు రోజుల పాటు ఈ పూజలు జరిపించారు. మొదటి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి కుంకుమ అర్చన, ఖడ్గమాల, శివ పార్వతి కళ్యాణం, త్రిశక్తి నవవరణ పూజలు నిర్వహించారు. రెండోరోజు సాయంత్రం 9 హోమగుండాలతో దుర్గగుడి అర్చకులు భక్తులతో చండీ యాగం నిర్వహించారు. దీంతో భక్తులు ఆనంద పరవశులు అయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా తానా సభ్యులు సేకరించిన విరాళాలను చిన్న పిల్లలకు సంబంధించి శస్త్రచికిత్సలకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. 

తానా ప్రముఖులు యుగంధర్ యడ్లపాటి, హేమ కానూరు, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ హను చెరుకూరి, తానా సభ్యులు ఉమ కటికి, రవి కాకర, చిరంజీవి గళ్ళ, సందీప్ ఎల్లంపల్లి, శివ త్రిపురనేని, సాయి మందిర్‌ తరఫున కుమార్ ప్రత్తిపాటి, సుజాత, లావణ్య, అమృత, సందీప్, కృష్ణ, రమేష్ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహాయ సహకారాలు అందించారు. వివిధ తెలుగు సంఘాల నాయకులు తమ మిత్రులతో కలిసి పెద్ద సంఖ్యలో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని