Karthika deepotsavam: న్యూజెర్సీలో ఘనంగా కార్తీక పౌర్ణమి దీపోత్సవం

కార్తీక పౌర్ణమి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. సాయిదత్తపీఠం ఆధర్వంలో ఎడిసన్‌లోని శ్రీ శివవిష్ణు దేవాలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది.

Published : 08 Nov 2022 21:12 IST

న్యూజెర్సీ: కార్తీక పౌర్ణమి వేడుకలు అమెరికాలోని న్యూజెర్సీలో ఘనంగా నిర్వహించారు. సాయిదత్త పీఠం ఆధర్వంలో ఎడిసన్‌లోని శ్రీ శివవిష్ణు దేవాలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. ఈ సంద‌ర్భంగా జరిగిన‌ సామూహిక‌ సత్యనారాయణ వ్రతంలో తెలుగు ఎన్నారైలు, వారి కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే శుభం కలుగుతుందని విశ్వసిస్తున్నారు. శంకరమంచి రఘుశర్మ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 
మహిళలు, పిల్లలు, పెద్దలు, యువతీయువకులు, కుటుంబ స‌భ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని