NRI TDP: లోకేశ్‌ను చూస్తే జగన్‌కు భయమెందుకు?: కోమటి జయరాం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చూస్తే సీఎం జగన్‌కు భయమెందుకని తెదేపా ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ప్రశ్నించారు.

Published : 22 Jan 2023 14:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను చూస్తే సీఎం జగన్‌కు భయమెందుకని తెదేపా ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కోఆర్డినేటర్‌ జయరాం కోమటి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడును అమెరికాలోని శాక్రమెంటో నగరంలో నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాక్రమెంటో నగర తెదేపా నూతన కార్యవర్గంతో జయరాం కోమటి ప్రమాణస్వీకారం చేయించారు. 

ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు నారా లోకేశ్‌ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్నారన్నారు. సైకో పాలన పోయి సైకిల్‌ పాలన రావాలంటే ప్రజలకు పార్టీ మరింత చేరువ కావాలని కోరారు. యువగళంను నిలువరించేందుకు ప్రజల ప్రాథమిక హక్కులను హరించివేస్తూ జీవో నంబర్‌ 1 ను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ దోపిడీ, వైఫల్యాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పాదయాత్ర దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు ఎన్నో ఆశలతో జగన్‌కు అధికారం అప్పగిస్తే ఆయన దాన్ని దుర్వినియోగం చేశారన్నారు. కేవలం కక్ష సాధింపు కోసమే సీఎం తన అధికారాన్ని వాడుతున్నారని విమర్శించారు. యువగళం పాదయాత్రను విజయవంతం చేయడంలో ప్రవాసాంధ్రులు కీలకంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. బే ఏరియా నుంచి తెదేపా నేత వెంకట్‌ కోగంటి, భాస్కర్‌ అన్నే, విజయ్‌ గుమ్మడి, పరుచూరి, కల్యాణ్‌ కోట, స్వరూప్‌ వాసిరెడ్డి, విజయ్‌ గింజుపల్లి, మధు, సాంబశివరావు గొల్లపూడి తదితరులు ఎన్టీఆర్‌కు పుష్పాంజలి ఘటించారు. 

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా శాక్రమెంటో అధ్యక్షుడు అమితాబ్‌ షేక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ కోనేరు, జనరల్‌ సెక్రటరీ నగేశ్‌ అల్లు, ట్రెజరర్‌ హరి దిరిసాల, రీజనల్‌ కౌన్సిల్‌ రిప్రజెంటేటివ్‌ రామకృష్ణ మాదాల, రీజినల్‌ కౌన్సిల్‌ కోఆర్డినేటర్‌ మురళీచంద్ర, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రామారావు కోమటినేని, రామప్రసాద్‌ కోమటి, నటరాజన్‌ గుత్తా, శ్యామ్‌ అరిబింది, వెంకట్‌ నాగం, కృష్ణ కంగాల, బాలాజీరావు ముమ్మనేని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని