Kuchipudi: సమ్మోహనం.. లహరి కూచిపూడి అరంగేట్రం

తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.

Published : 07 Jul 2022 19:06 IST

అమెరికా: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నృత్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్ర్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం అట్లాంటాలో లహరి పీసీకే(17) చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. ఆమెకు ఇదే తొలి ప్రదర్శన కావడం విశేషం. లహరి నృత్య ప్రదర్శన స్థానిక అమెరికన్లతో పాటు అక్కడికి విచ్చేసిన తెలుగు వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 

అట్లాంటాలో పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్‌ రెడ్డి, వాసవి పీసీకే దంపతులకు లహరి జన్మించారు. ఆమె తన 8వ ఏట నుంచే కూచిపూడి అభ్యాసం ప్రారంభించారు. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాల పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి పలువురు ప్రశంసలు పొందారు. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది.

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని అల్వాల గ్రామానికి చెందిన వేణు కుమార్‌ రెడ్డి 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని