న్యూజెర్సీలో ఘ‌నంగా మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు

శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్ర‌రాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు.

Updated : 12 Mar 2024 22:26 IST

న్యూజెర్సీ: శివుడికి ప్రీతిపాత్రమైన మహా శివరాత్రి పర్వదినాన ‘హర హర మహాదేవ శంభో శంకర’ అంటూ అగ్ర‌రాజ్యంలో ఎన్నారైలు ముక్తకంఠంతో నినదించారు. న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్‌లోని సాయిదత్త పీఠం శ్రీశివ విష్ణు ఆలయంలో మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. రఘుశర్మ శంకరమంచి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ వేడుకల్లో ప్ర‌వాస భార‌తీయులు భారీ సంఖ్య‌లో పాల్గొని పూజలు నిర్వ‌హించారు. మ‌హా పుణ్య‌క్షేత్రాన్ని త‌ల‌పించేలా శ్రీ శివ విష్ణు ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.

ఈ కార్య‌క్ర‌మాల్లో ఎన్నారై భ‌క్తులు త‌మ కుటుంబ స‌భ్యుల‌తో స‌హా పాల్గొన్నారు. దాదాపు తొమ్మిది వేల మంది ప్ర‌వాసులు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. చ‌లిని సైతం లెక్క‌చేయ‌కుండా బారులు తీరి, క్యూ లైన్లలో నిల‌బ‌డి శివ‌నామ‌స్మ‌ర‌ణ చేసుకున్న సంద‌ర్భం భక్తిపారవశ్యంతో అలరారింది. అభిషేకాలు, ఉపవాసాలు,ధూపదీప నైవేద్యాలు, జాగరణలు.. ఇలా అన్ని కార్య‌క్ర‌మాల్లో భ‌క్తులు ఉత్సాహంగా పాల్గొని పుల‌క‌రించిపోయారు.

మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల్లో భాగంగా మార్చి 8, 9 తేదీల్లో రఘుశర్మ శంకరమంచి ఆధ్వ‌ర్యంలో ప‌లు పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. శుక్ర‌వారం మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు, శ‌నివారం శివుడి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిపించారు. రుద్రాభిషేకం, రుద్ర‌హోమం, అమ‌రేశ్వ‌ర స్వామి, శివ‌పార్వ‌తి క‌ళ్యాణం వంటి కార్య‌క్ర‌మ ఘ‌ట్టాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా మ‌హా శివ‌రాత్రి విశిష్ట‌త‌ను రఘుశర్మ శంకరమంచి భ‌క్తుల‌కు వివ‌రించారు. సర్వాంతర్యామి శివుడి గాథ‌లు వినిపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని