షికాగోలో మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్‌ ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’

మాజీ మంత్రి, తెదేపా నేత మండలి బుద్ధప్రసాద్‌ అమెరికాలోని షికాగోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా కోఆర్డినేటర్‌ కోమటి జయరాం పర్యవేక్షణలో

Published : 27 Jul 2022 11:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాజీ మంత్రి, తెదేపా నేత మండలి బుద్ధప్రసాద్‌ అమెరికాలోని షికాగోలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ తెదేపా అమెరికా కోఆర్డినేటర్‌ కోమటి జయరాం పర్యవేక్షణలో అక్కడి తెదేపా నేతలు హేమ కానూరు ఆధ్వర్యంలో ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెదేపా అభిమానులు, ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. యుగంధర్‌ యడ్లపాటి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడారు. 

వర్తమాన రాజకీయాలతో పాటు తెలుగు జాతి వైభవాన్ని బుద్ధ ప్రసాద్‌ గుర్తుచేశారు. తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాంలో తెలుగుజాతికి లభించిన గుర్తింపు.. తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిని ఆయన ప్రస్తావించారు. తెలుగుజాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత, గాడితప్పిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని బుద్ధ ప్రసాద్‌ చెప్పారు.  

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్‌ను శాలువాతో మురళి మేరుగ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ తెదేపా (షికాగో) ప్రతినిధులు రవి కాకర, చిరంజీవి గల్లా, కృష్ణమోహన్‌, హను చెరుకూరి, శివ త్రిపురనేని, వినోజ్‌ చనుమోలు, రఘు చిలుకూరి, కిశోర్‌ త్రిపురనేని, పవన్‌ నల్లమల్ల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని