MATA: అమెరికాలో MATA ‘మదర్స్‌ డే’ వేడుకలు.. శ్రీలీల, సుమ సందడి

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (MATA) ఆధ్వర్యంలో కళావేదిక సమర్పణలో అమెరికాలో ‘మదర్స్‌ డే’ వేడుకలు ఘనంగా జరిగాయి.

Updated : 03 Jun 2024 13:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (MATA) ఆధ్వర్యంలో కళావేదిక సమర్పణలో అమెరికాలో ‘మదర్స్‌ డే’ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో జరిగిన ఈ ఉత్సవాల్లో హీరోయిన్‌ శ్రీలీల, యాంకర్‌ సుమ, గెస్ట్‌ సింగర్‌ శ్రీనిధి తిరుమల తదితరులు పాల్గొని సందడి చేశారు. ఎడిషన్‌ టౌన్‌షిప్‌ మేయర్‌ సామ్‌ జోషి ప్రత్యేక వీడియో సందేశం పంపించారు.

ఈ కార్యక్రమానికి తల్లితో కలిసి శ్రీలీల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లితో ఉన్న అనుంబంధాన్ని తెలిపారు. సినిమాల్లో తాను హీరోయిన్‌ అయితే.. నిజ జీవితంలో తనకు మాత్రం అమ్మే హీరోయిన్‌ అని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ‘కుర్చీ మడతపెట్టి’ పాటకు శ్రీలీల స్పెప్పులేసి ఉత్సాహపరిచారు. మహిళలతో యాంకర్‌ సుమ నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.

ఎన్‌ఆర్‌ఐలకు ఆరోగ్య పరంగా హెల్ప్‌ చేయడమే లక్ష్యంగా సుమ, శ్రీలీల చేతులమీ దుగా ‘మాటా హెల్త్‌ హెల్ప్‌ లైన్‌’ను లాంచ్‌ చేశారు. మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ప్రారంభమైన అనతికాలంలోనే సాధించిన మరో గొప్ప సేవా కార్యక్రమం ఇది అని అధ్యక్షుడు శ్రీనివాస్‌ గనగోని తెలిపారు. మున్ముందు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో హెల్త్‌ స్క్రీనింగ్‌ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు అందించేందుకు MATA టీమ్‌ ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు. తొలి దశలో అట్లాంటా, ఫ్లోరిడా, న్యూజెర్సీలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేలా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. తల్లి రుణం తీర్చగల బిడ్డలెవరూ ఈ లోకంలో పుట్టలేదని.. అందుకే కడవరకూ ఆమె ముఖంలో సంతోషం ఉండేలా చూస్తే చాలన్నారు. వయసు మీద పడ్డాక తల్లిని బిడ్డలా చూసుకుంటే కొంతైనా రుణం తీరుతుందని చెప్పారు. మదర్స్‌ డే వేడుకల్లో పాల్గొన్న అందరికీ శ్రీనివాస్‌ గనగోని ధన్యవాదాలు తెలిపారు.

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, భాజపా స్టేట్ ఆఫీస్ బేరర్ రవికాంతి ప్రదీప్ ఈ వేడుకల్లో పాల్గొని మాతృమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. క‌ళావేదిక ప్రెసిడెంట్ స్వాతి అట్లూరి, సెక్రటరీ ఉజ్వల్‌ కుమార్‌ కస్తాల, ట్రెజరర్‌ రవీంద్రనాథ్‌ నిమ్మగడ్డ, ఈవెంట్‌ కోఆర్డినేటర్‌ రంజనీ ఉండవల్లి, ట్రస్టీ సాకేత్‌ చదవలవాడ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిరణ్‌ దుద్దగి, జాయింట్‌ సెక్రటరీ టోనీ జన్ను, జాయింట్‌ ట్రెజరర్‌ సుంకిరెడ్డి, సెక్రటరీ ప్రవీణ్‌ గూడూరు, ట్రెజరర్‌ గంగాధర్‌ ఉప్పల, నేషనల్ కోఆర్డినేటర్‌ విజయ్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో MATA అనుబంధ విభాగాల సభ్యులు భాగస్వాములయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని