Waltair Veerayya: ఎన్‌ఆర్‌ఐ ఫ్యాన్స్‌ ‘వాల్తేరు వీరయ్య’ సంబరాలు.. ఆనందాన్ని పంచుకున్న చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Updated : 24 Jan 2023 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సందర్భంగా అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ‘రేగల్‌’ థియేటర్‌లో మెగా అభిమానులు వెంకట్‌ రత్నకుమార్‌ చవ్వాకుల, శివ సింగపురపు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఎన్‌ఆర్‌ఐ అభిమానులతో ఆన్‌లైన్‌ ద్వారా చిరంజీవి తన ఆనందాన్ని పంచుకున్నారు. 

చిరంజీవి లైవ్‌లో ఉన్నప్పుడే అభిమానులు కేక్‌ కట్‌ చేసి సెలబ్రేషన్స్‌ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘మీ అభిమానం వల్లే ఇంతటి విజయం సాధ్యమైంది’’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. డాలస్‌, హ్యూస్టన్‌, ఆస్టిన్‌, సియాటెల్‌, పోర్ట్‌లాండ్‌, బే ఏరియా, లాస్‌ ఏంజెల్స్‌, ఫీనిక్స్‌, డెన్వర్‌, షికాగో, మిన్నియాపాలిస్‌, సెయింట్‌ లూయిస్‌, కాన్సాస్‌ సిటీ, డెట్రాయిట్‌, కొలంబస్‌, అట్లాంటా, న్యూజెర్సీ, షార్లెట్‌, రాలీ, బోస్టన్‌, వర్జీనియా, మాంచెస్టర్‌, ఫిలడెల్ఫియా, పిట్స్‌బర్గ్‌, మేరీల్యాండ్‌ తదితర ప్రాంతాలతో పాటు కెనడా నుంచి అభిమానులు చిరుతో లైవ్‌లో ముచ్చటించారు. మరోవైపు చిరంజీవి తన ఇన్‌స్టాలో ఎన్‌ఆర్‌ఐ అభిమానుల సంబరాల వీడియోను పోస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని