mothers day: మేరీల్యాండ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృదినోత్సవ వేడుకలు

అమెరికాలోని మేరీల్యాండ్‌ ఏరియా ఫ్రెడ్‌రిక్స్‌లో అంతర్జాతీయ మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓక్డేల్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రాంగణంలో మే 18న జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కౌంటీ కౌన్సిల్‌ రినె క్నాప్‌ విచ్చేశారు. 

Published : 24 May 2024 22:14 IST

మేరీల్యాండ్‌: అమెరికాలోని మేరీల్యాండ్‌ ఏరియా ఫ్రెడ్‌రిక్స్‌లో అంతర్జాతీయ మాతృదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఓక్డేల్‌ మిడిల్‌ స్కూల్‌ ప్రాంగణంలో మే 18న జరిగిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా కౌంటీ కౌన్సిల్‌ రినె క్నాప్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీల బ్రేవో (ఫ్రెడరిక్స్‌ కౌంటీ కమ్యూనిటీ లియేషన్‌), WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి, అధ్యక్షురాలు శైలజ కల్లూరి, మేరీల్యాండ్‌ WETA (విమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌) బీవోడి ప్రీతిరెడ్డి, టెక్సాస్‌ బీవోడీ ప్రతిమ రెడ్డి, డీఎంవీ కల్చరల్‌ ఛైర్‌ చైతన్య పోలోజు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ స్వరూప సింగరాజు, మీడియా ఛైర్‌ సుగుణ రెడ్డి, ఇతర ప్రముఖ సంఘాల నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రావ్య మానస వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

అమ్మ అనే పదంలోనే షరతుల్లేని కరుణ, ప్రేమ, ధైర్యం, దయ వంటి అంశాలు ఇమిడి ఉన్నాయని, ప్రస్తుత సందర్భంలో సమాజంలో మహిళల పాత్రపై వక్తలు స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవకు గాను రీనె క్నాప్‌, వైసీల బ్రేవోలకు సేవా పురస్కారాలు అందించారు. అనంతరం ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. జీవితంలో అన్ని కష్టాల నుంచి మనల్ని కాపాడే రక్షణ కవచంలాంటిది తల్లి అన్నారు. సాంకేతికత, వైద్యం, పాక కళలు, ఇంజినీరింగ్‌, మరెన్నో ప్రాతినిధ్యాల్లేని రంగాల్లో బాలికలు, మహిళల అభివృద్ధికి మార్గాలను సృష్టించే ఉద్దేశంతో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం, స్పాన్సర్‌ చేయడం వంటి కార్యక్రమాలతో WETA కృషిచేస్తోందన్నారు. 

మదర్స్‌ డే ఈవెంట్‌లో భాగంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్థానిక నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలు, బహుమతులతో వినోదభరిత కార్యకలాపాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది డీసీ ఏరియా నివాసితులు, మేరీల్యాండ్‌ సభ్యులు పాల్గొన్నారు. తల్లులందరినీ సత్కరించేందుకు, అభినందించేందుకు పలు ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ తెలుగు ప్లేబ్యాక్‌ సింగర్‌ అంజనా సౌమ్య తన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.  వైభవంగా మదర్స్‌డే వేడుకల్ని నిర్వహించినందుకు ప్రెసిడెంట్‌ శైలజ కల్లూరి, లోకల్‌ వేట బృందం మేరీల్యాండ్‌ వేట-బీవోడీ ప్రీతిరెడ్డి, టెక్సాస్‌ బీవోడీ ప్రతిమ రెడ్డి, డీఎంవీ కల్చరల్‌ ఛైర్‌ చైతన్య పోలోజు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ స్వరూప సింగరాజు, మీడియా ఛైర్‌ సుగుణ రెడ్డి, వాలంటీర్స్‌ గురుచరణ్‌ చిట్నా, మోహన్‌ పులిచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక స్పాన్సర్లు భాస్కర్‌ గంటి, అరుణ్‌ ఎరువ, చంద్రలకు మెమెంటోలను బహుకరిస్తూ వారి సహాయ సహకారాలను కొనియాడారు. ఈసారి పెద్ద ఎత్తున హైస్కూల్‌, యువ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని ఈ వేడుక దిగ్విజయానికి దోహదపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని