సిలికాన్ వ్యాలీ, ట్రై వ్యాలీలో ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని సిలికాన్ వ్యాలీ, ట్రై వ్యాలీలో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని సిలికాన్ వ్యాలీలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రవాసాంధ్ర (ఎన్నారై) తెదేపా నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్నారై తెదేపా అమెరికా కో ఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ... చంద్రబాబు 1998లో ముఖ్యమంత్రిగా సిలికాన్ వ్యాలీలో పర్యటించిన విశేషాలను గుర్తు చేశారు. అలాగే చంద్రబాబుతో తన అనుబంధాన్ని వివరిస్తూ.. 2024లో ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరాన్ని విశ్లేషించారు. చంద్రబాబు వందో పుట్టినరోజు కూడా తన ఆధ్వర్యంలో జరిగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరు: రవి మందలాపు
క్రమశిక్షణ పాటించే అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెదేపా సీనియర్ నాయకుడు రవి మందలాపు కొనియాడారు. చంద్రబాబు స్థిత ప్రజ్ఞత ఉన్న నాయకుడని... ఎప్పుడు కలిసినా, ఆయన ఏదో ఒక విషయంపై తెలుసుకునే ప్రయత్నం చేయడమో, వివరించే ప్రయత్నమో చేస్తారని చెప్పారు. ఏడాది తర్వాత చంద్రబాబు అధికారంలోకి రాగానే, వంటిల్లును కేంద్రంగా చేసుకుని అనారోగ్య సమస్యలకు చికిత్సలు రూపొందించే అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో విధ్వంసక పాలనను చూశామని... ఏడాదిలోనే ఏపీలో అద్భుతమైన చంద్రబాబు పాలన ప్రారంభం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక తెలుగుదేశం యువనేత రవి కిరణ్ మాట్లాడుతూ ‘‘చంద్రబాబు వంటి నాయకుడు ముందు తరాలకు ఆదర్శం. ఆయన మార్గదర్శకంలో ఏపీ ముందుకు సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో విజయం చంద్రబాబుదే’’ అని చెప్పారు.
తెలుగుదేశం నేత వెంకట్ కోగంటి సమన్వయ పరిచిన ఈ కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, లక్ష్మణ్ పరుచూరి, గోకుల్ రాచవరపు, జోగి నాయుడు, వెంకట్ అడుసుమల్లి, హరి సన్నిధి, వెంకట్ గొంప, కోటిబాబు కోటిన, భాస్కర్ అన్నే, మోహన్, కళ్యాణ్ కోట, స్వరూప్ వాసిరెడ్డి, రవి, సాయి ఖమాబాపతి, మధు కందేపి సాయి యనమదల, పాములు నారాయణ వినయ్ యలమర్తి, భరణి యాతం, రమేష్ నాయుడు, వీరు వుప్పల, సుభాష్ ఆర్, రవికిరణ్ ఆలేటి, రవి ఆలపాటి, సతీష్ బొల్ల, ప్రకాష్ ఎన్, తమిళనాడు ఎన్నారై తెదేపా నేత కుమార్ వేల్ తదితరులు పాల్గొన్నారు.
ట్రై వాలీలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ రామన్‌లో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపి మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెదేపా తరఫున ఏ విధంగా పని చేయాలనే విషయంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగు ఓటర్లను తెదేపాకు సానుకూలంగా ఎలా మలచాలనే విషయంపైనా, పార్టీకి మద్దతుగా ఎలా నిలవాలనే విషయాలపైనా తీర్మానాలు చేశారు.
స్థానిక తెలుగుదేశం నేత యంవి.రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరచగా, కార్యక్రమం విజయవంతం చేయడంలో గీత ఆలపాటి, శిల్ప మద్దినేని ముఖ్యపాత్ర పోషించారు. సురేష్ పోతినేని, అజయ్ నల్లూరి, రామ్‌ప్రసాద్, కేశవ్, రంగ నాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Japan: ప్రధాని ఇంట్లో ప్రైవేటు పార్టీ.. విమర్శలు రావడంతో కుమారుడిపై వేటు!
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
Crime News
Crime News: బాగా చదివి లాయర్ కావాలనుకుని.. ఉన్మాది చేతిలో కత్తి పోట్లకు బలైపోయింది
-
Movies News
Chinmayi: స్టాలిన్ సార్.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి
-
Politics News
Congress: ఆ ఒక్క ఎమ్మెల్యే తృణమూల్‌లో చేరిక.. బెంగాల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మళ్లీ ఖాళీ!