మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్‌పై నాట్స్ అవగాహన సదస్సు

మెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా డాక్టర్లు కావాలనుకునే విద్యార్థుల కోసం మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది.

Updated : 24 Oct 2022 21:55 IST

టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా డాక్టర్లు కావాలనుకొనే విద్యార్థుల కోసం మెడికల్ అడ్మిషన్ అప్లికేషన్ స్క్రీనింగ్‌పై అవగాహన సదస్సు నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం ఆధ్వర్యంలో తెలుగు అసోషియేషన్ ఆఫ్ ఫ్లోరిడా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి. ఫ్లోరిడాలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ సదస్సు జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా(యుఎస్ఎఫ్)లో అసోసియేట్ డీన్, అడ్మిషన్స్ ఎండీ డాక్టర్ ఎడ్వింగ్ డేనియల్, యుఎస్ఎఫ్‌లోని తనేజా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివ కుమార్ పంగులూరి ఈ సదస్సులో ఎన్నో విలువైన విషయాలను వివరించారు. డాక్టర్ శివ కుమార్ పంగలూరి ఈ సదస్సుకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహారించారు. దాదాపు 80 మందికి పైగా ఈ సదస్సుకు హాజరయ్యారు. 500 మందికి పైగా పరోక్షంగా ఆన్‌లైన్‌ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సు అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు డేనియల్, శివకుమార్‌లు సమాధానాలు ఇచ్చారు.

మెడికల్ అడ్మిషన్లపై విద్యార్థులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఇంత చక్కటి కార్యక్రమానికి వేదికను ఇచ్చినందుకు అయ్యప్పస్వామి ఆలయ నిర్వాహకులకు నాట్స్ ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపాబే విభాగం ఈ సదస్సును పక్కా ప్రణాళికతో నిర్వహించి విజయవంతం చేసింది. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ ఛైర్ విమెన్‌ అరుణ గంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సభ్యులు కొత్త శేఖరం, బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాదికి నాట్స్ టెంపాబే విభాగం ధన్యవాదాలు తెలిపింది. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, చాప్టర్ కో-ఆర్డినేటర్ సుమంత్ రామినేని,  జాయింట్ చాప్టర్ కో-ఆర్డినేటర్ విజయ్ కట్టా, వాలంటీర్ హరి మండవ టీఏఎఫ్ కమిటీ నాయకులు డాక్టర్ రఘు జువ్వాడి, జగదీశ్‌ తౌతం, బిందు బండ, రాజా పంపాటి, ప్రసాద్ కొసరాజు, అయ్యప్ప ఆలయ నాయకత్వ బృందం డాక్టర్ శ్రీకుమార్ చెల్లప్పన్, విజయ్ నారాయణస్వామి, వాలంటీర్లు సునీల్, బాలాజీ, దుష్యంత్ తదితరులు ఈ సదస్సు విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సుకు సహకరించిన నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి (బాపు) నూతి, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ మీడియా ఎగ్జిక్యూటివ్ మురళి మేడిచెర్లకి నాట్స్ టెంపాబే విభాగం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని