సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణం పట్ల ‘నాట్స్’ సంతాపం

 ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే.. మరో సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 26 Dec 2022 01:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిని మరవకముందే.. మరో సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా వందల సినిమాల్లో నటించిన ఆయన ఏ పాత్ర వేసినా అందరి చేత శభాష్ అనిపించుకున్నారని నాట్స్ ఛైర్‌పర్సన్‌ అరుణ గంటి అన్నారు. తెలుగు సినిమాల్లో విలనిజంతో పాటు కామెడీ పండించడంలో కూడా చలపతిరావుది విలక్షణమైన శైలి అని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. చలపతిరావు కుటుంబానికి నాట్స్ సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని