చికాగోలో ‘నాట్స్ తెలుగమ్మాయి’కి విశేష స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి చికాగోలో విశేష స్పందన లభించింది.
చికాగో: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న తెలుగమ్మాయి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. తాజాగా చికాగోలో నిర్వహించిన తెలుగమ్మాయి కార్యక్రమంలో వందలాది మంది తెలుగు మహిళలు పాల్గొని సందడి చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు గొప్పతనాన్ని ప్రదర్శించే వేదికగా అమెరికాలో నాట్స్ తెలుగు అమ్మాయి కార్యక్రమాన్ని రూపొందించారు. చికాగోలో తెలుగమ్మాయిలు తమ తెలుగుదనాన్ని ప్రదర్శించేందుకు పోటీ పడ్డారు. 350మందికి పైగా ఈ కార్యక్రమంలో సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని తెలుగుదనాన్ని చాటారు. ‘తెలుగమ్మాయి ముద్దుగుమ్మలు’ విభాగంలో విజేతగా హాసిని పోకల, తొలి రన్నరప్‌గా భామిని శనక్కాయల, 2వ రన్నరప్‌గా అక్షర ఆరికట్ల నిలిచారు. ‘కావ్య నాయకి’ విభాగంలో విజేతగా గీతిక మండల, తొలి రన్నరప్‌గా అనూష కడము, రెండో రన్నరప్‌గా పావని నల్లం నిలిచారు.
చికాగో చాప్టర్ సహ సమన్వయకర్త బిందు వీధులమూడి, నేషనల్ కోఆర్డినేటర్ లక్ష్మి బొజ్జా, చాప్టర్ మహిళా నాయకురాలు రోజా శీలంశెట్టి, చికాగో చాప్టర్ సమన్వయకర్త హరీష్ జమ్ముల, వీర తక్కెళ్లపాటి, భారతి పుట్ట, నరేంద్ర కడియాల, కార్తీక్ మోదుకూరి,వేణు కృష్ణారెడ్డిల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. చికాగోలాండ్‌కు చెందిన నాట్స్ ఈసీ నాయకులు మదన్ పాములపాటి, కృష్ణ నిమ్మగడ్డ, ఆర్.కె.బాలినేని తెలుగమ్మాయి కార్యక్రమం విజయవంతానికి అవసరమైన దిశా నిర్దేశాన్ని అందించారు. చికాగో ప్రాంతానికి చెందిన మూర్తి కొప్పాక, శ్రీను అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి తమ పూర్తి సహకారం అందజేశారు. మే 26,27,28 తేదీల్లో న్యూజెర్సీలో జరగనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగువారంతా తరలిరావాలని నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ అధ్యక్షుడు బాపయ్య (బాపు)నూతి , నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని సాదరంగా ఆహ్వానించారు. ప్రముఖ మహిళా నాయకురాలు చాందిని దువ్వూరి, హవిలా మద్దెల, టీఏసీజీసీ గత ప్రెసిడెంట్ ప్రవీణ్ వేములపల్లి, మిసెస్ ఎన్.ఆర్.ఐ గ్లోబల్ 2022 గౌరీ శ్రీ, మిసెస్ ఇండియా ఇల్లినాయిస్- శ్వేతా చిన్నారి తెలుగమ్మాయి కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. మాధురి పాటిబండ్ల తన యాంకరింగ్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఛాప్టర్ వాలంటీర్లు రాజేష్ వీధులమూడి, చెన్నయ్య కంబాల, అంజయ్య వేలూరు, నరేష్ యాద, బిందు బాలినేని, కళ్యాణి మందడపు, నవీన్ జరుగుల, సుజిత్ , శ్రీనివాస్ పిల్ల తదితరులు ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగమ్మాయి కార్యక్రమానికి ప్రత్యేకంగా విందు భోజనం ఏర్పాటు చేసిన బౌల్ ఓ బిర్యానీ, బావర్చికి నాట్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Elon Musk: చైనాలో ల్యాండ్ అయిన ఎలాన్ మస్క్..!
-
India News
Wrestlers Protest: మా పతకాలను నేడు గంగలో కలిపేస్తాం.. రెజ్లర్ల హెచ్చరిక
-
Crime News
Hyderabad: రాజేశ్‌ది హత్యేనా? ప్రభుత్వ టీచర్‌తో వివాహేతర సంబంధమే కారణమా?
-
General News
Top Ten News @ IPL Final: ఐపీఎల్ టాప్ 10 కథనాలు
-
Sports News
IPL 2023: ఐపీఎల్ విజేత ధోనీ సేన అయినా.. ఎక్కువ అవార్డులు ఆ జట్టుకే..
-
Movies News
Allu Arjun: నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.. మా నాన్నే నాకు దేవుడు..: అల్లు అర్జున్