NATS: నాట్స్ ‘తెలుగమ్మాయి’ కార్యక్రమానికి మంచి స్పందన
అమెరికాలోని తెలుగువారి ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని తెలుగువారి ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా న్యూజెర్సీలో నిర్వహించిన ‘తెలుగమ్మాయి’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఎంతో మంది అమ్మాయిలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కేవలం అందమే కాకుండా ప్రతిభ, తెలుగు భాషపై పట్టు, సామాజిక సేవ, ఆత్మీయ అనుబంధాలు.. ఇలా పలు విభాగాల్లో పోటీదారులను పరీక్షించారు. అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని నాట్స్ విజేతలుగా ప్రకటించింది. న్యూజెర్సీ పరిధిలో నాట్స్ తెలుగమ్మాయిగా శ్రుతి యర్రగుంట్ల ప్రథమ స్థానం కైవసం చేసుకోగా.. సాయిశ్రీ వల్ల వింజమూరి ద్వితీయ స్థానం, మౌక్తిక చక్కిలం తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ముగ్గురు విజేతలను నాట్స్ ఘనంగా సత్కరించింది. మే నెలలో జరగనున్న ‘తెలుగమ్మాయి’ ఫైనల్ పోటీలో వీరు పోటీపడాల్సి ఉంటుంది.
న్యూజెర్సీలో తెలుగమ్మాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాట్స్ ఛైర్‌విమెన్ అరుణ గంటి విశేష కృషి చేశారు. ఆమె నాయకత్వంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా కవిత తోటకూర తన టీమ్‌లోని సీత అయ్యల, శ్రీదేవి జాగర్లమూడి, బిందు యలమంచిలి, ఉమామాకం, స్వర్ణ గడియారం, శ్రీదేవి పులిపాక, గాయత్రి చిట్టేటి, లావణ్య తొడుపునూరి, ప్రణీత పిడిగిమర్రి, సమత కోగంటి, శ్రీనివాస్ తోడుపునూరి, రమణ యలమంచిలి, ఫణిమోహన్ తోటకూర, సురేష్ మాకం, నాగేశ్వర్ ఐతా, వెంకట్ జాగర్లమూడి, బసవ శేఖర్ శంషాబాద్, రాశి శంషాబాద్ తదితరులు కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాట్స్ 7వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానితో పాటు బోర్డ్ గౌరవ సభ్యులు, బోర్డ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. తెలుగు అమ్మాయి కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ Sambaralu.orgలో రిజిస్టర్ చేసుకుని సంబరాలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!
-
India News
ChatGPT: భారత్ వెర్షన్ చాట్‌జీపీటీ ఎప్పుడంటే..? మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిదే..!
-
Sports News
Labuschagne:ఐపీఎల్లో నా ఫేవరెట్ టీమ్ అదే.. అశ్విన్ బెస్ట్ స్పిన్నర్: లబుషేన్
-
Movies News
Social Look: బీచ్‌లో వేదిక.. షాపులో శాన్వి.. ఆరెంజ్ దుస్తుల్లో ప్రియ!
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్