డబ్లిన్‌లో ఘనంగా ఎన్టీఆర్‌, కోడెల జయంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు శత జయంతి, మాజీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసాద రావు 75 వ జయంతి వేడుకలు

Published : 09 May 2023 21:49 IST

డబ్లిన్‌: తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు శత జయంతి, మాజీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసాద రావు 75వ జయంతి వేడుకలు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఎన్నారై టీడీపీ యూరప్ - ఐర్లాండ్ విభాగం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా డా. కోడెల శివరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులు ఎన్టీఆర్,  కోడెల మధుర స్మృతులు, వారు జన్మభూమికి అందించిన సేవలను గుర్తు చేసుకొని పుష్పాంజలి ఘటిస్తూ నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో పలువురు మాట్లాడుతూ.. తన తండ్రిలాగే  శివరాం కూడా ప్రజాసేవ చేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆయనకు జ్ఞాపికను బహూకరించారు.

 ఈ సందర్భంగా పసందైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. ఎన్నారై టీడీపీ రీజినల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని, ప్రెసిడెంట్ భాష్యం భరత్ ఆధ్వర్యంలో  జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు మహిళా నాయకురాలు దీప్తి, హిమజ, జ్యోతిర్మయి జ్యోతి ప్రజ్వలన చేయగా వెంకట కృష్ణ ప్రసాద్ కాట్రగడ్డ, శివ వేములపల్లి సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, లి, రాజేష్ పల్లేటి, జగన్ ముత్తుముల, ప్రసాద్ కొణిదల, నరేంద్ర ముప్పాళ్ల, అరుణ్, కృష్ణ మందల, కిషోర్ కొత్తపల్లి,  కోటేంద్ర, రామ్ వంగవోలు తదితర సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని