ఘనంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్‌సైట్ ఆవిష్క‌ర‌ణ‌

ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వ‌చ్ఛమైన స‌మాజ‌మే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ త‌న వెబ్‌సైట్‌ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్య‌మైన సాంకేతిక ప్ర‌యాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్ర‌మానికి విచ్చేసిన పలువురు వ‌క్త‌లు పేర్కొన్నారు.

Published : 01 Apr 2024 20:24 IST

న్యూయార్క్: ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వ‌చ్ఛమైన స‌మాజ‌మే ల‌క్ష్యంగా ఆవిర్భ‌వించిన క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ త‌న వెబ్‌సైట్‌ను www.qef.org ఆవిష్కరించింది. నాణ్య‌మైన సాంకేతిక ప్ర‌యాణంలో దీన్నొక మైలురాయిగా ఈ కార్యక్ర‌మానికి విచ్చేసిన పలువురు వ‌క్త‌లు పేర్కొన్నారు.  న్యూయార్క్ నగరంలోని ప్రముఖ తాజ్ హోటల్‌లో వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా..  ఈ కార్య‌క్ర‌మంలో క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ తన లక్ష్యాలను, దీర్ఘకాల ప్రణాళికలను వెల్లడించింది. క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేషన్ (QEF) వెబ్‌సైట్ ప్రారంభం సంద‌ర్భంగా సద్గురు శ్రీ మధుసూదన్ సాయి త‌న ఆశీర్వచనాలతో పాటు నిర్వాహకులకు ‘ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం’ అనే సందేశాన్ని అందించారు. ప్ర‌స్తుత ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు ఎప్ప‌టికప్పుడు ప‌రిష్కారం చూపుతూ.. ఉత్త‌మ స‌మాజ నిర్మాణం దిశ‌గా సాగుతోన్న క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేష‌న్ చేస్తోన్న కృషికి తన సహకారం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  తమ ఫౌండేషన్‌ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన మధుసూదన్‌ సాయిని      శ్రీ అట్లూరి, సంతోష్‌ యంసాని, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన సేవల్ని కొనియాడారు.

QEF వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ అట్లూరి మాట్లాడుతూ..  తమ ఫౌండేషన్‌ను బలోపేతం చేయడంలో భాగంగానే ఏర్పాటుచేసిన కొత్త వెబ్‌సైట్ ద్వారా కొత్త‌గా, ఉత్తమమైన, అందరికీ ఉపయోగపడే అంశాలను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్ర‌పంచ సాంకేతిక‌ రంగానికి కేంద్రంగా క్వాలిటీ ఇంజినీరింగ్ ఫౌండేష‌న్ వెబ్‌సైట్ అవ‌త‌రిస్తుంద‌ని పేర్కొన్నారు. స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఇదో దిక్సూచిగా మార‌నుందన్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాప్టర్లు ప్రారంభించ‌బోతున్నామ‌న్నారు.  వివిధ రంగాల‌కు త‌మ‌దైన ప‌రిజ్ఞానంతో స‌రికొత్త సాంకేతిక సామ‌ర్థ్యాలను అందించాలన్న ఆలోచనతో ముందుకుసాగుతున్నామ‌ని, ఇదొక నాన్ ప్రాఫిట్ ఆర్గ‌నైజేష‌న్ అని చెప్పారు. సాంకేతిక ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌మాణాల‌ను అందుకోవాల‌నుకుంటున్నవారు.. త‌మ వెబ్‌సైట్‌ను సంద‌ర్శిస్తే.. వారికి త‌ప్ప‌కుండా త‌గిన స‌మాచారం లభిస్తుందని, ప్ర‌స్తుతం సాగుతున్న ట్రెండ్ ఏమిటనేది అర్థమవుతుందని ఫౌండేష‌న్ క‌మిటీ స‌భ్యులు తెలిపారు. నిస్వార్థ సేవలతో మాత్రమే ప్రపంచ నలుమూలలకు సమత-మమత- సౌభ్రాతృత్వాలను అందించగలమని చాటి చెప్పే సద్గురు మధుసూదన్‌ సాయి స్ఫూర్తి తమను ముందుకు నడిపిస్తోందని.. ఆయన ఆశీర్వాదంతో ఈ ఫౌండేషన్‌ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సమాజాన్ని మరింత ఉన్నతమైన నాణ్యతా విలువలతో నిర్మిస్తుందని చెప్పగలమని ఈసందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని