16న దుబాయిలో తెదేపా ‘మీట్ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమం

Published : 13 Oct 2022 16:16 IST

దుబాయి: ఈ నెల 16న దుబాయిలో తెదేపా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం జరగనుంది. భవిషత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు కరామా ప్రాంతంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, తెదేపా నేత గొల్లపల్లి సూర్యారావు, గల్ఫ్‌ తెదేపా అధ్యక్షుడు రావి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు యూఏఈ తెదేపా నేతలు తెలిపారు. గల్ఫ్‌ తెదేపా కమిటీ వేసిన తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు వస్తున్న సందర్భంగా వారికి ఘనంగా స్వాగతం పలకనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని