NRI TDP: న్యూయార్క్ ‘టైమ్ స్క్వేర్’లో రోజంతా ‘అన్న ఎన్టీఆర్’ డిస్‌ప్లే..
తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ‘ఎన్నారై తెదేపా-అమెరికా’ ఆధ్వర్యంలో ‘టైమ్ స్క్వేర్’లో ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు.

న్యూయార్క్: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ‘ఎన్నారై తెదేపా-అమెరికా’ ఆధ్వర్యంలో ‘టైమ్ స్క్వేర్’లో ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. ఎన్నారై తెదేపా అమెరికా కో-ఆర్డినేటర్ జయరాం కోమటి నేతృత్వంలో ‘అన్న ఎన్టీఆర్’ చిత్రమాలికను ప్రకటన రూపంలో డిస్‌ప్లే చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో ఉండే ఈ డిస్‌ప్లేను ఈ నెల 27 అర్ధరాత్రి నుంచి 28వ తేదీ (ఎన్టీఆర్ జయంతి) అర్ధరాత్రి వరకు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎంతో వ్యయ ప్రయాసలతో ఏర్పాటు చేస్తున్న ఈ డిస్‌ప్లే ప్రకటన ద్వారా ఎన్టీఆర్ కీర్తి విదేశాల్లో మరింత ప్రాచుర్యంలోకి రానుందని ఎన్నారై తెదేపా నేతలు చెప్పారు. ప్రతి 4 నిమిషాలకు ఒకసారి 15 సెకన్ల చొప్పున ఎన్టీఆర్‌కు సంబంధించిన విభిన్న చిత్రాలను ప్రకటన ద్వారా ప్రసారం చేయనున్నట్లు వివరించారు. ప్రపంచంలోని ఎన్టీఆర్ అభిమానులంతా దీన్ని చూసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎన్నారై తెదేపా నాయకురాలు విద్య గారపాటి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. సెకను పాటు ప్రదర్శనకు కూడా భారీగా వసూలు చేసే టైమ్ స్క్వేర్‌లో.. ఏకంగా 24 గంటల పాటు ‘అన్న ఎన్టీఆర్’ డిస్‌ప్లే ఏర్పాటు చేయడం గొప్ప విషయమని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు