Nri news: ఉపేంద్ర చివుకుల ప్రజాసేవకు గుర్తింపు..అభినందించిన గవర్నర్‌

అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు అరుదైన గౌరవం దక్కింది. గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన నూజెర్సీ పరిపాలన విభాగం.. ఆయన సేవలను ప్రశంసిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

Published : 14 Jan 2023 20:15 IST

న్యూజెర్సీ: అమెరికాలో తెలుగువాడైన ఉపేంద్ర చివుకులకు అరుదైన గౌరవం దక్కింది. గత కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన నూజెర్సీ పరిపాలన విభాగం.. ఆయన సేవలను ప్రశంసిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. న్యూజెర్సీ పబ్లిక్ యూటీలీటీస్ బోర్డు సమావేశంలో కమిషర్లు ఫియోర్డలిసో, హోల్డెన్, సోలమన్, గోర్డాన్, క్రిసోడౌలాలు.. ఉపేంద్ర చివుకుల సేవలను గుర్తిస్తూ చేసిన తీర్మాన ప్రతిని ఆయనకు అందించారు. పన్ను చెల్లింపుదారులు, రేట్ పేయర్స్ కోసం గత 25 సంవత్సరాలుగా ఆయన చేసిన సేవలు మరువలేమని వారు అన్నారు. చిత్తశుద్ధితో, సేవా దృక్పథంతో పని చేసిన ఉపేంద్రను అభినందిస్తూ గవర్నర్ ఫిల్ మర్ఫీ కూడా ఓ ప్రశంసా పత్రాన్ని అతడిని అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని