Ireland: డబ్లిన్‌లో ఘనంగా వాసవీ మాత అగ్నిప్రవేశ దినోత్సవం

శ్రీవాసవీ సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  

Updated : 15 Feb 2024 16:42 IST

డబ్లిన్‌: శ్రీవాసవీ సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాఘ శుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవీమాత భక్తులు, కమిటీ సభ్యులంతా కలిసి ఉదయాన్నే కింగ్స్ వుడ్ ప్రాంతంలో ఉన్న వినాయగర్ ఆలయానికి చేరుకొని మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ముందుగా పిల్లలు, తర్వాత మహిళలంతా కలిసి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించి లలితా సహస్రనామ పఠనం, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలు అలరించాయి. 

కార్యక్రమంలో భాగంగా మహిళలందరూ అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా అంకిత వ్యవహరించారు. లక్ష్మి హాసిని వాసవి పురాణం నుంచి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించి వాసవి దివ్యకథను చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు, పెద్దలు ఆనందంగా గడిపారని కోర్‌కమిటీ సభ్యుడు అనీల్‌ తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్‌ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. అనంతరం బాలకృష్ణన్ మాట్లాడుతూ.. అమ్మవారి కార్యక్రమాలు వినాయగర్ ఆలయంలో నిర్వహించడం, భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం ఆనందదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహరణలతో వివరించారు. అందుబాటు ధరలో భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కు, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించిన రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలను కమిటీ సభ్యులు సన్మానించారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషి చేసిన మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు కోర్ కమిటీ సభ్యులతో పాటు సేవాదళ్ సభ్యులు గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని