NRI TDP: ఆస్టిన్‌లో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి, మినీ మహానాడు
అమెరికాలోని ఆస్టిన్‌లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు.
జయరాం కోమటి ఆధ్వర్యంలో విజయవంతం
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని ఆస్టిన్‌లో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 10వ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ తెదేపాను స్థాపించి చేపట్టిన కార్యక్రమాలు, అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయసాధనకు చేపట్టాలసిన కార్యక్రమాలను యువతకు నేతలు వివరించారు. ఈ సందర్భంగా జయరాం కోమటి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏపీని ఎలా దివాళా తీయించిందో చెప్పారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రాల్లోని పాటలతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో యువత, చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Rains: మూడు రోజులు తేలికపాటి వర్షాలు
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు