ఛార్లెట్‌లో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి ఉత్సవాలు

తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలను ఛార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు.

Updated : 28 May 2024 21:00 IST

అమెరికా: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, అభిమానుల ఆరాధ్య రాముడు నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలను ఛార్లెట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  అభిమానులు, తెదేపా సానుభూతిపరులు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఛార్లెట్‌ నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి తమతమ నియోజకవర్గాల్లో తెదేపా తరఫున ప్రచారం చేసి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారితో తమ అనుభవాలను పంచుకున్నారు. 

ఈ ఎన్నికల్లో తెదేపా విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా ఎన్టీఆర్‌ నట విశ్వరూపాన్ని స్మరించుకుంటూ ఆయన నటించిన ఎన్నో సినిమాలు అందరి గుండెల్లో నేటికీ చెరగని ముద్ర వేశాయని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని