అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి

ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో దివంగత నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్‌) 27వ వ‌ర్ధంతి కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వహించారు. 

Published : 19 Jan 2023 01:58 IST

అమెరికా: తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అమెరికాలోని ప్రవాసులు కొనియాడారు. అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ వంటివి ఎన్టీఆర్‌కు ప‌ర్యాయ‌ప‌దాల‌ని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న బే ఏరియాలో దివంగత నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్‌) 27వ వ‌ర్ధంతి కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా జ‌య‌రాం మాట్లాడుతూ.. గలగలా ప్రవహించే గోదావరిని పలకరించినా, బిరబిరా పరుగులిడే కృష్ణమ్మను ప్రశ్నించినా, ఉత్తుంగ తరంగ తుంగభద్రని కదిలించినా అవి చెప్పేవి ఒక్కటే.. యుగపురుషుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంవ‌త్సరం నేప‌థ్యంలో గ‌త 9 నెలలుగా శతజయంతి ఉత్సవాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు జ‌య‌రాం కోమ‌టి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకుడు వెంకట కోగంటి, విజయ్ గుమ్మడి, ప్రసాద్ మంగిన, హరి సన్నిధి, సతీష్ అంబటి, వీరు ఉప్పల, శ్రీని వల్లూరిపల్లి, గోకుల్ రాచరాజు, భాస్కర్ అన్నే, బెజవాడ శ్రీనివాస్, లక్ష్మణ్ పరుచూరి, కళ్యాణ్ కోట, సతీష్ బోళ్ల, భరత్ ముప్పిరాళ్ళ, సురేంద్ర కారుమంచి, వాసు బండ్ల, నవీన్ కోడాలి, సుందీప్ ఇంటూరి త‌దిత‌రులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల‌ర్పించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు