న్యూజెర్సీలో ఓఎఫ్‌ భాజపా ఆధ్వర్యంలో ‘ఛాయ్‌పే చర్చ’

న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు.

Updated : 11 Mar 2024 22:31 IST

అమెరికా: న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలో ‘ఛాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్ ఆఫ్ భాజపా పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీకి మూడోసారి విజయం చేకూరేలా ఛాయ్ పే చర్చ, కాలతాన్, చౌకీదార్ మార్చ్, కార్ ర్యాలీలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు మరోసారి ప్రణాళికలు రచిస్తున్నట్లు అధ్యక్షుడు డా. అడపా ప్రసాద్‌ తెలిపారు. 

తెలంగాణ భాజపా ఎన్నారై జాయింట్ కన్వీనర్ విలాస్‌ జంబుల మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా విరాజిల్లుతోందని, ఈ తరుణంలో ప్రజలంతా కర్తవ్యంగా భావించి మోదీ ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భాజపా పటిష్టతకు, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి భాజపా, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తోడ్పాటు అందించాలన్నారు. ఓఎఫ్ భాజపా న్యూజెర్సీ టీం చరణ్ సింగ్, అమర్, ధీరన్, గణేష్ మాట్లాడుతూ.. నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీ నోట్లపై సర్జికల్ స్ట్రైక్స్‌ చేశారన్నారు. ఓఎఫ్ భాజపా న్యూజెర్సీ తెలంగాణ కమిటీ టీం సంతోష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నాగ మహేందర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాల సహకారంతో భాజపాకు 400 సీట్లు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఓఎఫ్ భాజపా సభ్యులు హరి సేతు, దీప్ భట్, ధీరేన్ పటేల్, గణేష్, మల్లికార్జున్, లీనా భట్, దీప్తి సురేష్ జానీ, శరద్ అగర్వాల్, వంశీ యంజాల, మధుకర్ రెడ్డి, ప్రదీప్ కట్ట, అల్కా బిజుర్వేదీ, సాయి దత్త పీఠం నుంచి రఘు శంకరమంచి, ఇతర సంస్థల నుంచి పలువురు మద్దతు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని