హ్యూస్టన్‌లో ఉత్సాహంగా ‘ఓఎంసీ క్లాస్ ఆఫ్ 82’ సమ్మేళనం
అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘ఉస్మానియా మెడికల్ కాలేజ్ (ఓఎంసీ) బ్యాచ్ ఆఫ్ 77 క్లాస్ ఆఫ్ 82’ పేరుతో 40 సంవత్సరాల వార్షికోత్సవ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది.
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికాలోని హ్యూస్టన్‌లో ‘ఉస్మానియా మెడికల్ కాలేజ్ (ఓఎంసీ) బ్యాచ్ ఆఫ్ 77 క్లాస్ ఆఫ్ 82’ పేరుతో 40 సంవత్సరాల వార్షికోత్సవ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. డాక్టర్ ఉమా మోహన్ ఆధ్వర్యంలో మే 4 నుంచి మే 6 వరకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మే 4 గురువారం రాత్రి డా. ఉమా మోహన్ నివాసంలో డిన్నర్‌తో ఈ సమ్మేళనం ప్రారంభమైంది. మే 5 శుక్రవారం సాయంత్రం గాయని శారద ఆకునూరితో కలిసి డా.సతీష్ జోషి, డా.శ్రీధర్, డా.భరత్, డా.వేణు, డా.విక్టర్, డా.రవికుమార్ పాడిన పాటలతో సంగీత విభావరి ఆహూతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సమ్మేళనానికి అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 70 మంది హాజరయ్యారు. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మే 6 శనివారం ఉదయం నుంచే సందడి ప్రారంభమైంది. బస్‌లో నాసాకి వెళ్లిన అనంతరం ఇండియన్ రెస్టారెంట్‌లో అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆటపాటలు, డ్యాన్సులు, స్కిట్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సమ్మేళనం సందర్భగా ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రముఖ పల్మనాలజిస్ట్ డా.కల్పలత ముఖ్యఅతిథిగా హాజరై మొదటి పుస్తకాన్ని విడుదల చేశారు.
అనంతరం డా.ఉమ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన డా. విజయానంద్, డా. భరత్ , డా. వాణి, డా. వేణు, డా. ఆశా, డా. అరుణ , డా. పాయ్,డా. సుభదలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత బాలీవుడ్ డ్యాన్సులతో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. డా.ఉమ సారథ్యంలో వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం మిత్రులకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. త్వరలోనే మరో చోట సమ్మేళనాన్ని మళ్లీ నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
ఏపీ సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్: థియేటర్లో విడుదలైన ఇంట్లో కొత్త సినిమా చూసేయొచ్చు!
-
Sports News
CSK: పారితోషికం తక్కువ.. పెర్ఫామెన్స్ ఎక్కువ.. ఆ చెన్నై ప్లేయర్స్ ఎవరంటే?
-
World News
Imran Khan: నాలుగో భార్యనవుతా.. ఇమ్రాన్‌ఖాన్‌కు టిక్‌టాకర్ ప్రపోజల్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pawan kalyan: పవన్ షూ రూ.లక్ష.. అక్షయ్ బ్యాక్‌ప్యాక్ రూ.35వేలు.. ఇదే టాక్ ఆఫ్ ది టౌన్!
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరీ