పేద విద్యార్థుల చదువుకు అండగా ‘పరుష ఫౌండేషన్’

అమెరికాలో పేద విద్యార్థుల చదువుకు తన వంతుగా ఆర్థిక సాయం చేస్తూ ప్రశంసలు అందుకొంటున్నారు తెలంగాణకు చెందిన మహేశ్‌ పరుష.

Published : 01 Jan 2023 20:50 IST

మేరీల్యాండ్‌: పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేస్తూ తన దాతృత్వాన్ని చాటు కొంటున్నారు మహేశ్‌ పరుష. విద్యా దానమే మహాదానంగా భావించిన ఆయన.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో స్థాపించిన తమ పరుష ఫౌండేషన్‌ ద్వారా అనేకమంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తూ వారి కలల్ని సాకారం చేస్తున్నారు. తద్వారా సమాజ అభ్యున్నతికి తనవంతు తోడ్పాటు అందిస్తూ ప్రశంసలు అందుకొంటున్నారు. తాజాగా విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలన్న ఉద్దేశంతో మహేశ్‌ పరుష.. 20వేల డాలర్లు ఇచ్చి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. విద్య జ్ఞానాన్ని ప్రసాదిస్తే.. ఆ జ్ఞానం జీవితానికి స్వావలంబన ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి అమెరికా వెళ్లిన మహేశ్‌.. పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా ఆర్థిక సాయం చేస్తూ తన వంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భవిష్యత్తులో విద్యార్థుల చదువుకు ఎలాంటి అవసరం ఉన్నా తాను ముందువరుసలో నిలబడి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. తాను చేస్తోన్న ఈ సాయానికి అనేక పాఠశాలల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని