PV Sindhu: పీవీ సింధును సత్కరించిన ‘సింగపూర్ తెలుగు సమాజం’
ఇంటర్నెట్‌డెస్క్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ విజేతగా నిలిచిన తెలుగు తేజం పీవీ సింధును ‘సింగపూర్ తెలుగు సమాజం’ ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సత్కరించింది. సింగపూర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధుతో పాటు ఆమె తండ్రి వెంకట రమణను ఆ సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి మాట్లాడుతూ పీవీ సింధు తన ఆటతీరుతో భారతదేశంతో పాటు తెలుగువారందరూ గర్వించేలా చేసిందని.. భవిష్యత్‌లో మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలన్నారు. కామెన్వెల్త్, వరల్డ్ ఛాంపియన్ షిష్‌లోనూ ఆమె విజయం సాధించాలని ఆకాంక్షించారు.
తనను సత్కరించిన సింగపూర్ తెలుగు సమాజానికి పీవీ సింధు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను తెలుసుకుని.. సింగపూర్‌లో నివసించే తెలుగువారికి చేస్తున్న సేవలను ఆమె కొనియాడారు. సింగపూర్ తెలుగు సమాజం జులై 31న నిర్వహించనున్న బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొననున్న క్రీడాకారులకు సింధు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 13న సింగపూర్‌లో తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘నారీ’ కార్యక్రమంలో మహిళంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona : 15 వేల కొత్త కేసులు.. 32 మరణాలు
-
Movies News
Kartik Aaryan: ఐఎన్ఎస్ కోల్‌కతా యోధులతో కలిసి కార్తీక్ ఆర్యన్ సందడి..
-
General News
CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్
-
Ap-top-news News
Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం