ఎన్‌ఆర్‌ఐ తెదేపా మీడియా సమన్వయకర్తగా సాగ‌ర్ దొడ్డ‌ప‌నేని నియామ‌కం

తెలుగు దేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మీడియా సమన్వయకర్తగా సాగ‌ర్ దొడ్డ‌ప‌నేని నియమితులయ్యారు.

Updated : 14 May 2023 23:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు దేశం పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మీడియా సమన్వయకర్తగా సాగ‌ర్ దొడ్డ‌ప‌నేని నియమితులయ్యారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెదేపా ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఎన్నార్టీ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ర‌వి వేమూరి హ‌యాంలో సాగ‌ర్ దొడ్డ‌ప‌నేని మీడియా కో-ఆర్డినేటర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ సమయంలో ఎన్నారైలకు ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా నిలిచారు. 

తెలుగు దేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి దూకుడు పెంచింది. పార్టీని మరింత బ‌లోపేతం చేయ‌డంతో పాటు కీల‌క నాయ‌కుల‌కు పలు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెదేపాను ఇప్ప‌టి నుంచే అన్ని రూపాల్లోనూ అధినేత చంద్ర‌బాబు స‌ర్వ‌స‌న్న‌ద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎన్‌ఆర్‌ఐ తెదేపాపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని