షికాగోలో ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

అమెరికాలోని షికాగోలో తెలుగువారు సంక్రాంతి, భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Published : 31 Jan 2023 10:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని షికాగోలో తెలుగువారు సంక్రాంతి, భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘ట్రై స్టేట్‌ తెలుగు అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో స్థానిక హిందూ టెంపుల్‌ ఆఫ్‌ లేక్‌ కౌంటీ ఆలయ ప్రాంగణంలో ఈ సంబరాలు జరిగాయి. సంస్థ అధ్యక్షుడు హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించిన సంగీత, నాట్య కార్యక్రమాలు అలరించాయి. ప్రసాద్ మరువాడ, హేమంత్ పప్పు ఆధ్వర్యంలో రేఖా వేమూరి, స్వప్న పులా, ప్రశాంతి తాడేపల్లి, అర్చన మిట్ట, శిల్ప మచ్చ ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. ఈ వేడుకల్లో సుమారు 300 మందికిపైగా పాల్గొన్నారు. హేమంత్ పప్పు సహకారంతో సోమలత యనమందల, దిలీప్ రాయపూడి చేసిన వేదిక అలంకరణ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి ఆచంట, రవి వేమూరి, భాను సిరమ్, రామకృష్ణ తాడేపల్లి, శిరీష కుప్పం, సహస్ర వీరపల్లి ఎంతో తోడ్పడ్డారు. స్థానిక తానా నాయకులు హేమ కానూరు, హను చెరుకూరి, కృష్ణ మోహన్ చిలంకూరు, రవి కాకర, చిరు గళ్ల హాజరై పార్టిసిపెంట్స్‌కు సర్టిఫికెట్లు బహుకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని