జాక్సన్విల్లేలో ‘తాజా’ సంక్రాంతి సంబరాలు అదరహో..!
విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకొంటున్నారు. అమెరికాలోని ‘తాజా’ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి.
జాక్సన్విల్లే: అమెరికాలోని గ్రేటర్ జాక్సన్విల్లే ప్రాంతంలోని తెలుగువారు సంప్రదాయబద్ధంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొన్నారు. జాక్సన్విల్లే తెలుగు సంఘం (తాజా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో చిన్నా పెద్దా కలిసి సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు. జనవరి 21న ‘తాజా’ అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి, వారి టీమ్ ఆధ్వర్యంలో జాక్సన్విల్‌లోని బొల్లెస్మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో గ్రాండ్‌గా నిర్వహించిన ఈ వేడుకలు అందరినీ అలరించాయి. తమ సొంత ఊరిలో వేడుకలను చేసుకుంటున్నామా అన్నట్లుగా మురిపించాయి. తెలుగుదనంతో ప్రదర్శించిన నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషను, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, సంప్రదాయ దుస్తుల పోటీలను నిర్వహించగా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల అలంకరణలు, రుచికరమైన అల్పాహారం, స్వీట్లతో కూడిన రాత్రి భోజనంతో పాటు అనేక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పద్మప్రియ కొల్లూరు, సమత దేవునూరి, వినయ యాద ఈవెంట్ డైరెక్టర్లుగా వ్యవహరించారు.
ఈ సందర్భంగా ‘తాజా’ అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలను ఇంత ఘనంగా జరుపుకొనేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ‘తాజా’ ద్వారా కమ్యూనిటీకి నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా ఈ సంఘం నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన ఎగ్జిక్యూటివ్ టీమ్‌ను అభినందించారు. కమిటీ సభ్యులు, వాలంటీర్లు, గ్రేటర్ జాక్సన్విల్లే ప్రాంత తెలుగు భాష, సంగీతం నేర్చుకునే పిల్లలు, మనబడి, పాఠశాల, సఖా ఇతర సంగీత పాఠశాలలు, ‘తాజా’ కుటుంబాల వారి ఉపాధ్యాయుల మద్దతుతో జరిగిన ఈ వేడుకలు అందరినీ అలరించేలా సాగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. 2023 సంక్రాంతి ఈవెంట్‌కు ఉదారంగా స్పాన్సర్షిప్ చేసినందుకు వాసవి గ్రూప్ యుఎస్ఎ, భవన్ సైబర్‌టెక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రుచికమైన ఆహారాన్ని అందించిన మసాలా ఇండియన్ క్యూసిన్ రెస్టారెంట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ వేడుకలకు ఆడియో, వీడియో - అనిల్ యాడ, రాజేష్ చందుపట్ల; తెరవెనుక - మల్లి సత్తి, నవీన్ మొదలి, శ్రీదేవి ముక్కోటి, దీప్తి పులగం, ఫైనాన్స్ - శ్రీధర్ కాండే, శేఖర్ రెడ్డి సింగల, కృష్ణ పులగం, ధీరజ్ పొట్టి; ఆపరేషన్స్ - నారాయణ కసిరెడ్డి, భాస్కర్ పాకాల, సునీల్ చింతలపాణి, లక్ష్మీ నారాయణ లింగంగుంట, ప్రవీణ్ వూటూరి, ఆర్కే స్వర్ణ, సంపత్ నంబూరి, రవి సత్యవరపు, వెంకట్ రెడ్డి బచ్చన్న; వీడియో అండ్ ఫోటోగ్రఫీ - సత్యదీప్, జయ, సుమన్ సజ్జన, సంజీబ్ సింగ్; అలంకరణ -రంగోలి - శృతిక, నర్సన్న మాదాడి, రమ్య వలుస, వినీల, శ్రీకన్య సత్యవరపు, శ్యామల పొలాటి, గోమతి కండే, సుశీల దాలిబోయిన; ఎంసీలుగా వ్యవహరించిన శ్రీధర్ డోగిపర్తి, పద్మ ప్రియ కొల్లూరు తదితరులకు తాజా అధ్యక్షుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఈవెంట్‌తో TAJA 2022 కమిటీ గడువు ముగియడంతో ప్రస్తుత అధ్యక్షుడు సురేష్ మిట్టపల్లి నూతన అధ్యక్షుడు మహేష్ బచ్చు, బృందానికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: 175 స్థానాల్లో వైకాపాను ఓడించడమే లక్ష్యం: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్‌తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు