తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉపకారవేతనాల పంపిణీ

తానా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ చేపట్టారు.

Published : 07 Sep 2023 22:28 IST

హైదరాబాద్‌: తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం కింద కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లోని 35 మంది నిరుపేదపిల్లలకు ఉపకారవేతనం అందజేశారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తానా సభ్యులతో పాటు భారాస యువనాయకుడు ఉప్పులూరి రామ్ చౌదరి, నిరంజన్ శృంగవరపు, కోఆర్డినేటర్ శ్రీకాంత్ పోలవరపు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శశికాంత్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఉపకరావేతనాల పంపిణీ చేపట్టామని అన్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని