TANA: తానా ఫౌండేషన్ ఛైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఫౌండేషన్‌ నూతన కార్యవర్గం

Updated : 01 Jul 2022 22:32 IST

టెక్సాస్‌: తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఫౌండేషన్‌ నూతన కార్యవర్గం కొలువుదీరింది. జూన్ 30న జరిగిన ట్రస్టీల సమావేశంలో తానా ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, కార్యదర్శిగా విద్యాధర్ గారపాటి, కోశాధికారిగా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. 

ఛైర్మన్‌గా ఎన్నికైన శశికాంత్ వల్లేపల్లి సుదీర్ఘకాలంగా ఫౌండేషన్‌లో సేవలందిస్తున్నారు. కాంత్ ఫౌండేషన్ స్థాపించి భారీగా విరాళాలు అందించారు. కరోనాతో  ఇబ్బందులు పడిన చాలా కుటుంబాలని ఆదుకునేందుకు  సొంత నిధులు వెచ్చించారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్‌గా వెయ్యి మందికి పైగా విద్యార్థులకు  ప్రోత్సాహకాలు అందించారు. గతంలో ఫౌండేషన్ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.  

తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఎన్నికైన విద్యాధర్ గారపాటి.. మూవర్స్ డాట్ కామ్ అధినేతగా అందరికీ సుపరిచితులు.  దాదాపు 100కి పైగా ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరాలకు రూపకల్పన చేశారు. ప్రముఖ క్రికెటర్ కపిల్దేవ్ ఆడిన బ్యాట్‌ను రూ.18 లక్షలకు  కొనుగోలు చేసి  తానాకు విరాళంగా అందజేశారు. విద్యాధర్ గతంలో తానా పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా, న్యూజెర్సీ, న్యూయార్క్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. తానా ఫౌండేషన్ కోశాధికారిగా ఎన్నికైన వినయ్ మద్దినేని తానా సౌత్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్‌గా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా(తామా) అధ్యక్షుడిగా సేవలందించారు. అట్లాంటాలో తామా ఉచిత క్లినిక్  నిర్వహణకు కృషి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వేలాదిమందికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు