పిట్స్‌బర్గ్‌లో వైభవంగా షిరిడీ సాయినాథుని పల్లకి ఉత్సవం

అమెరికాలో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిథుని పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. షిరిడి సాయి గానగ మందిర్ ఆధ్వర్యంలో జులై 16న నిర్వహించిన .......

Updated : 20 Jul 2022 19:37 IST

పిట్స్‌బర్గ్‌: అమెరికాలో పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిథుని పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. షిరిడి సాయి గానగ మందిర్ ఆధ్వర్యంలో జులై 16న నిర్వహించిన ఈ వేడుకకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. షిరిడి సాయి గానగ మందిర్ వ్యవస్థాపకులు వెంకట్ దిరిశాల (బాబా వెంకట్) ఆధ్వర్యంలో చెక్క వెంకట సత్యనారాయణ మూర్తి (మూర్తి), లక్ష్మి దంపతులు, శశి చలిమిడి, హరిత బండ్లమూడి, మాల్యాద్రి కొరిపి, సతీష్ చెల్లబోయిన, తిరుమల రెడ్డి అల్ల, రవి, దివ్య, స్రవంతి దురిశేటి, శ్రీకాంత్ ముద్దసాని, సాహు జగ్నయసెన్, ప్రణవన్ త్యాగరాజన్ తదితరులు అహర్నిశలు కృషిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 150 మంది భక్తులు తరలివచ్చి సాయినాథుడి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. 

చిన్మయ మిషన్ (పిట్స్‌బర్గ్) ఆలయ ప్రధాన అర్చకులు ధర్మతేజ ఈ పల్లకి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం క్రతువులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం, గురు ప్రార్థన, బాబా అభిషేకం (శ్రీ రుద్రప్రశ్నః), బాబా మూల మంత్రం, సంపుటీకరణ సాయి విశేష అర్చన, మహా నైవేధ్య, బాబా హారతి, మంత్ర పుష్పంతో శాస్త్రోక్తంగా ఈ పల్లకి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్రవంతి దురిశేటి, శిరీష వీరంరెడ్డి, దీత్య దీపక్, ఉదయ మేఘరాజ్, రమాదేవి పప్పు, సుజాత మామిడి ప్రదర్శించిన కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిరిడి సాయి గానగ మందిరం తరపున ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అమెరికాలో పుట్టి పెరిగిన ఈ తరం పిల్లలకు షిరిడి సాయినాథుని ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించిన వెంకట్ దిరిశాల, నళిని దంపతులకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. 

సాయి పల్లకి ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు తమవంతు సహకారం అందించిన డా.శ్రీకాంత్, చెక్క వెంకట సత్యనారాయణ మూర్తి (మూర్తి),మాల్యాద్రి కొరిపి, కార్తిక్, వెంకట్, హరిత బండ్లమూడి, రమేష్ వేముల, శివ జూలూరు, శివ, రవి కిరణ్ తుమ్మల, రమణ (ఫోటోగ్రాఫర్), శిరీష గుంటక (ఫోటోగ్రాఫర్), అలాగే భక్తులకు ప్రసాదం సమకూర్చిన వారితో పాటు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు వెంకట్ దిరిశాల దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. 

షిరిడి సాయి గానగ మందిర్ ఇటు అమెరికాలోను, అటు భారతదేశంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఒంగోలు జిల్లా ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామంలో షిరిడి సాయి గానగ మందిరం తరపున వృద్ధాశ్రమం, అనాధ ఆశ్రమాలు స్థాపించి ఆశ్రయంతో పాటు పిల్లలకు విద్యను అందిస్తోంది. ఎవరైనా అనాధ పిల్లలను గానీ, వృద్ధులను గానీ చేర్పించాలన్నా.. సంస్థ చేస్తోన్న సామాజిక కార్యక్రమాలకు మీ వంతు ఆర్థిక సాయం అందించాలనుకున్నా www.ssgmus.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని నిర్వాహకులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు