అమెరికాలో శోభన్‌బాబు జయంతి
హ్యూస్టన్ టెక్సాస్: అమెరికా గానకోకిల శారద ఆకునూరి రూపకల్పన, సారథ్యం దివంగత నటుడు శోభన్‌బాబు 85వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ‘వంశీ గ్లోబల్ అవార్డ్స్ అమెరికా-ఇండియా’ ఆధ్వర్యంలో శిరోమణి డాక్టర్ రామరాజు నిర్వహణలో జనవరి 23న ఆన్లైన్లో ఈ వేడుకలు జరిపారు. శోభన్‌బాబుతో కలిసి వివిధ చిత్రాల్లో పనిచేసిన నటులు మురళీమోహన్, చంద్రమోహన్, డాక్టర్ జమున, దర్శకులు కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు, రాశీ మూవీ క్రియేషన్స్ అధినేత నరసింహారావు, డా.నగేష్ చెన్నుపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభన్‌బాబుతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిపోతుంటే తనని మాత్రం శోభన్‌బాబు మద్రాస్‌లోనే ఉండిపొమ్మన్నారని సీనియర్ నటుడు చంద్రమోహన్ గుర్తుచేసుకున్నారు. ఆయన సలహాతోనే తానిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొన్నారు. ఆత్మీయ మిత్రుడిని కోల్పోవడం ఎప్పటికీ లోటేనని భావోద్వేగానికి గురయ్యారు. శోభన్‌బాబు చిత్రాల్లోని ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన ఆకునూరి శారదతో పాటు చెన్నైకి చెందిన రాము, అమెరికాకు చెందిన గాయనీగాయకులు విశ్వమోహన్, శ్రీకర్ దర్భ, నాగి, శ్వేతా, లక్ష్మిపలు పాటలు పాడి సంగీత నీరాజం అందించారు.
ఇవీ చదవండి...
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
‘లంచం లేదంటే మంచం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Movies News
Anupama Parameswaran: పబ్లిక్‌లో రాజమౌళి కాళ్లకు నమస్కరించిన అనుపమ
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Hyderabad: మహిళ చెర నుంచి నా కుమారుడిని కాపాడండి.. హెచ్ఆర్సీని ఆశ్రయించిన తండ్రి